జగన్ రెడ్డి తనపై మీడియా తప్పుడు ప్రచారం చేసిందని వంద కోట్లకుపరువు నష్టం దావాలు వేస్తానని ప్రకటించారు. అయితే ఆయన ఇందు కోసం ఢిల్లీ దాకా పోయారు. ఢిల్లీ హైకోర్టులో ఈ పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. ఆయనకు ఎప్పుడూ కలలోకి వచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు మాత్రమే కాకుండా ఈ సారి ఆజ్ తక్ గ్రూపుపైనా దావా వేశారు. అమెరికా ఎఫ్బీఐ కేసులో తన పేరు లేకపోయినా… తన పేరు ఉందని ప్రచారం చేశారని తనకు పరువు నష్టం అయిందని పరిహారం ఇప్పించాలని కోరారు.
ఇంత సిల్లీగా పరువు నష్టం పిటిషన్ ఎలా దాఖలు చేస్తారో కానీ.. ఆయన పేరు ఉందని ఇప్పటికే డాక్యుమెంట్లతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రినే డబ్బులు తీసుకున్నాడని స్పష్టం చేశారు. కోర్టులకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదని జగన్ ఎలా అనుకుంటున్నారో కానీ.. నేరుగా ఢిల్లీ హైకోర్టుకు పోయారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పిటిషన్ వేసుకోవాలంటే లోకల్ హైకోర్టులు ఉన్నాయి. ఏపీనో.. తెలంగాణ హైకోర్టులోనో పిటిషన్ వేస్తే ఓ రకంగా ఉండేది. కానీ ఆయన పని పట్టుకుని ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లారన్నదే ఆసక్తికరం. నారా లోకేష్ తనపై సాక్షి తప్పుడు ప్రచారం చేసిందని విశాఖ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ జగన్ మాత్రం ఢిల్లీని ఎంచుకున్నారు.