జార్ఖండ్ ముఖ్యమంత్రి… తన ప్రజలకు కరోనా విషయంలో అండగా నిలవలేకపోతున్నానని.. కష్టాలు చెప్పుకునేందుకు టీమిండియా కెప్టెన్ అయిన మోడీ కనీసం చాన్సివ్వడం లేదని.. నోరు తెరవనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా బాధేసింది. వెంటనే సోషల్ మీడియాలో రిప్లయ్ ఇచ్చారు. హేమంత్ సోరెన్నను .. బీజేపీ స్టైల్లో దేశాన్ని బలహీనం చేస్తున్నారని విమర్శించారు.
జార్ఖండ్ సీఎం బాధ చెప్పుకుంటే జగన్‌కు కోపం ఎందుకు వచ్చింది..?
నిజానికి సీఎం జగన్‌కు హిందీ రాదు. జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ హిందీలో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్‌ను ఎవరైనా సలహాదారులు ట్రాన్స్‌లేట్ చేసి అర్థమయ్యేలా చెప్పారేమో కానీ.. జగన్‌కు చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే.. సోషల్ మీడియాలోనే రిప్లయ్ ఇచ్చారు. సోదరా అని సంబోధించి.. హేమంత్ సోరెన్ రెండు లైన్ల ట్వీట్ చేస్తే.. జగన్ ఆరు లైన్ల విమర్శలు చేశారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అండగా ఉందామని సుద్దులు చెప్పారు. కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని సలహా ఇచ్చారు. కరోనా టైమ్‌లో రాజకీయాలు చేసి మోడీని విమర్శిస్తే దేశం బలహీనమవుతుందని చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియా ద్వారా మోడీకి వీరతాళ్లు వేస్తున్నారా..?
అసలు తనకేమాత్రం సబంధం లేకపోయినా.. ప్రధాని నరేంద్రమోడీకి వీరతాళ్లు వేయడానికి అన్నట్లుగా.. ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రం సీఎంపై జగన్ విమర్శలు కురిపించడం… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు అడిగినన్ని టీకాలు కానీ.. కరోనా సాయం కానీ అందించకపోయినా.. మోడీని.. కేంద్రాన్ని అసలు ప్రశ్నించనే ప్రశ్నించని ఏపీ సీఎం జగన్… ప్రశ్నిస్తున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోషల్ మీడియాలో విమర్శించడం ప్రారంభించారు. తమ బాధలు మోడీ వినడం లేదని హేమంత్ సోరెన్ చెప్పడమే.. రాజకీయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
బీజేపీ కౌంటర్ స్ట్రాటజీలో జగన్ భాగస్వామిగా మారారా..?
ఏపీలో జరుగుతున్న ఎన్నో అంశాలపై కనీసం నోరు మెదపని సీఎం జగన్.. అసలు … తనకేమాత్రం సంబంధం లేకపోయినా… జార్ఖండ్ సీఎం ఇష్యూలో జోక్యం చేసుకోవడం… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నరేంద్రమోడీ గుడ్ లుక్స్‌లో ఉండటానికి జగన్ చొరవ తీసుకున్నారా లేక… విపక్షాలకు… అప్రకటిత మిత్రపక్షాలతో కౌంటర్ ఇచ్చే స్ట్రాటజీని బీజేపీ అమలు చేయడం ప్రారంభించిందా.. అన్న చర్చ జరుగుతోంది. అచ్చంగా మోడీని విమర్శిస్తే… దేశం బలహీనం అవుతుందన్నట్లుగా జగన్ ట్వీట్ పెట్టడం… అచ్చంగా బీజేపీ భావజాలంలాగే ఉంది. బీజేపీని విమర్శిస్తే.. దేశభక్తి లేదన్నట్లుగా.. కౌంటర్ వేయడం.. ప్రధానిని విమర్శిస్తే దేశాన్ని బలహీనం చేస్తున్నట్లుగా మాట్లాడటం బీజేపీ నేతల స్టైల్. ఇప్పుడు జగన్.. పూర్తిగా బీజేపీ నేతల స్టైల్లోకి వెళ్లినట్లుగా ఉన్నారన్న అంచనాలు ఈ ట్వీట్ ద్వారా ప్రారంభమయ్యాయి.
Dear @HemantSorenJMM,
I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation. (1/2) https://t.co/0HZr56nOj2— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2021