ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి..? అధికారం కోల్పోవడాన్ని అవమానంగా ఫీలయ్యే జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేక కేసీఆర్ తరహాలోనే డుమ్మా కొడుతారా..?
ఇప్పుడిదే ఏపీలో బిగ్ డిబేట్. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని సర్వేలు, సెఫాలజిస్టులు తేల్చేస్తున్నారు. సంక్షేమం ఒకటే సరిపోదని , అభివృద్ధిని జగన్ విస్మరించడంతో వైసీపీ దారుణమైన పరాభవం చవిచూడబోతుందని విశ్లేషిస్తున్నారు. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే సరేసరి… ప్రతికూలంగా వస్తేనే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది వైసీపీ వర్గాల ప్రశ్న.
ఐదేళ్లు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులనే కాకుండా , చంద్రబాబును కూడా దారుణంగా అవమానించిన జగన్ రెడ్డి… ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తాడా..?అధికారం పక్షం నుంచి ప్రతిపక్షంకు పరిమితమైతే, దానిని అవమానంగా ఫీల్ అయి డుమ్మా కొడుతారా..? అనే చర్చల నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రాడన్నారు. ఆయన స్వభావం తనకు తెలుసునని…ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ కాలు మోపబోరని స్పష్టం చేశారు.
రఘురామ వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తంగా కాకపోయినా కొన్ని రోజులపాటైనా జగన్ రెడ్డి అసెంబ్లీకి డుమ్మా కొడుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదో ఓ సాకుతోనైనా మొదటి అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు.