జగన్ మోహన్ రెడ్డి అంటే ఓక ఇది.. ఒక అది అని వైసీపీ నేతలు ఎలివేషన్లు ఇస్తూంటారు. కానీ ఎప్పుడు ప్రసంగించినా ఆయన ప్రతిభ ఏమిటో ప్రజల ముందు కనిపిస్తూనే ఉంటుంది. చూసి చదవడానికే బండబూతులు చదువుతూ ఉంటారు. ఇక సొంతంగా చెప్పాల్సి వస్తే ఏమవుతుందో ఎవరికీ తెలియదు.అందుకే ఆయన ఐదేళ్లుగా మీడియా ముందుకు రారు. షర్మిల , సునీత లాంటి వాళ్లు సాక్షి మీడియా ప్రతినిధుల్ని కూడా ప్రశ్నలు అడగమంటారు.. కానీ జగన్ వాళ్లను ఎదురుగా చూడటానికి కూడా ఇష్టపడరు. తన బినామీలతో వాటాలను కొని… సజ్జలను అప్రకటిత ఎడిటర్ గా కొనసాగిస్తున్న టీవీ9 నుంచి రజనీకాంత్ ను పిలిపించుకుని ఇంటర్యూలు ఇచ్చారు. దానికి ముందు కూడా ఎలివేషన్లు ఇచ్చారు. తీరా ఇంటర్యూ చూస్తే అబ్బా.. ఇంత తేలివితేటలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
మద్రాస్ .. చెన్నై ఎందుకు అయింది.. పోర్టు వల్ల… బొంబాయి ముంబై ఎందుకు అయింది పోర్టు వల్ల.. శ్రీకాకుళం పోర్టు వల్ల ముంబై అవుతుంది … ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆన్సర్. కట్టాల్సిన పోర్టును ఆపేసి..నాలుగేళ్ల తర్వాత శంకుస్థాపన చేసి తానే పోర్టులు కట్టేసి.. తీరం మొత్తాన్ని బొంబాయి చేస్తున్నానని చెప్పుకునేందుకు పడిన తాపత్రయం అది. గతంలో ప్రత్యేకహోదా వస్తే అన్ని జిల్లాలు హైదరాబాద్ లో అన్నారు. అది మర్చిపోయారు. ఇంటర్యూలో ఇలాంటి ఆణిముత్యాలన్నీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సీరియస్ గా అభివృద్ధి అనే అంశంపై అవగాహన ఉండదు. తన సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే వాటిలో ఏది నచ్చితే దాన్నే ఫాలో అయిపోతారని తేలిపోయింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆయన ఇచ్చిన వివరణ ప్రజల్లో మరింత భయందోళనకు కారణం అవుతోంది. ఎవరి భూమి అయినా బయట వాళ్లు కబ్జా చేస్తే ప్రభుత్వం పరిహారం ఇస్తుదంట. అంటే ప్రజల ఆస్తుల్ని కొట్టేసి ప్రజల సొమ్మునే పరిహారం ఇచ్చే పెద్ద ప్లానే వేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ తో చేసిన ఇంటర్యూ మొత్తం.. ప్రీ ప్లాన్డ్. స్క్రిప్టెడ్. అలాంటి వాటికి సమాధానాలివ్వడానికి ఆయన తంటాలు పడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఓ ముఫ్పై మంది జర్నలిస్టులతో ఇంటరియాక్ట్ అవుతారు. అందరికీ సమాధానాలు చెబుతారు. చంద్రబాబు ఓ వంద మంది జర్నలిస్టులైనా సమాధానాలు చెబుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి నలుగురు జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు భయపడి సమాధానాలు చెప్పలేక.. ప్రెస్మీట్లు పెట్టలేరు. ఈ విషయంలో ఆయన సోదరీమణులుఇద్దరూ ఎంతో మెరుగు.