మళ్లీ అధికారంలోకి వస్తాను మీకేమి కావాలంటే అది చేస్తాను….. అందర్నీ అరెస్ట్ చేసి లోపలేయండి అని జగన్ రెడ్డి పిచ్చి పట్టినట్లుగా అధికారులను ఆదేశిస్తున్నారని తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. చాలా మంది అధికారంలో భయంతో వణికిపోతున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు తర్వాత ఇక అసలు ఆశల్లేకుండా పోయినట్లు అయింది. చెత్తబళ్ల వారి దగ్గర నుంచి ఫ్లెక్సీలు వేసుకునే వారి వరకూ ఎవర్నీ వదలకుండా చేసిన అరాచక పాలనతో ఇప్పటికే ప్రజలు విసిగిపోయారు. దీనిపై అధికారులకు స్పష్టత ఉంది. కానీ జగన్ రెడ్డి చెప్పినట్లు చేయకపోతే ఏమవుతామోనన్న ఆందోళన ఉంది . కానీ ఆయన చెబుతున్నవీ మరీ అతిగా ఉండటంతో ఎంత విధేయ అధికారులైనా సరే ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ రెడ్డి మళ్లీ గెలిస్తే… చేయడానికి చాలా ఉంటుంది. కానీ ఆయనకు గెలవలేనని స్పష్టత వచ్చింది. అందుకే అధికారంలో ఉండగానే తన కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు. ఆయనకు జనాలను బాగు చేయాలన్న కోరికలు ఉండవు. తాను దోచుకుని.. తన దోపిడీని ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేయాలన్న కోరిక మాత్రమే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, రామోజీరావు లను అరెస్ట్ చేయాలన్నది ఆయన కల. ఆయన కలను… ఏ మాత్రం ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా చేశారు. ఇప్పుడు లోకేష్ పైనా అదే కుట్ర చేస్తున్నారు. రామోజీరావుపై చర్యల విషయంలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ జగన్ రెడ్డి పోలీసులు ఎప్పుడో రాజారెడ్డి రాజ్యాంగంలో సైన్యంలా మారారు కాబట్టి అర్థరాత్రో..అపరాత్రో వెళ్లి మనిషిని పట్టుకుని వచ్చేయవచ్చు.
ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఎందుకు తమపై ఒత్తిడి తెస్తున్నారో సీనియర్ అధికారులు ఆలోచించలేకపోతున్నారు. మళ్లీ గెలుస్తామని నమ్మకం ఉంటే.. ఆయన ఇలా ఎన్నికలకు ముందు అధికార దుర్వినియోగం చేసుకుని ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుకోరని చెబుతున్నారు. చాలా మంది అధికారులకు ఈ విషయం అర్థమైంది. కానీ జగన్ రెడ్డి మళ్లీ తానే వస్తానని వారికి నమ్మ బలుకుతున్నారు. కాసిని సీట్లు తగ్గుతాయేమో కానీ తానే గెలుస్తానంటున్నారు. అదేదో మళ్లీ గెలిచిన తర్వాత చేసుకోవచ్చు కదా… ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎందుకు అంటే.. మాత్రం సమాధానం ఉండటం లేదు.
మళ్లీ జగన్ రెడ్డి గెలిచే అవకాశం లేదని అధికార వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అందుకే వంది మాగధులుగా పేరు పడి… భారీగా అక్రమార్జన చేసి… తమ జుట్టును ప్రభుత్వ పెద్దల చేతుల్లో పెట్టినవారు మాత్రమే ఇప్పుడు వారు చెప్పినట్లుగా చేస్తున్నారు. చివరికి వారంతా.. జగన్ రెడ్డి కోరికలు తీర్చి.. తాము బలయ్యే పరిస్థితులు కల్పించుకుంటున్నారని తోటి అధికారవర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.