వాలంటీర్లకు ఉన్నంత విలువ కూడా తమకు లేకుండా పోయిందే అని బాధపడుతున్న మంత్రులకు జగన్ ఊరటనిచ్చారు. ఇక నుంచి సంక్షేమ పథకాలు వాలంటీర్ల చేతుల మీదుగా కాదని.. మంత్రుల చేతుల మీదుగానే చేయాలని మంత్రివర్గ సమావేశంలో సూచించారు. వాలంటీర్లే నేరుగా పథకాలు ప్రజలకు అందిస్తూంటే.. తమకు విలువ లేకుండా పోయిందని.. ప్రజలెవరూ తమ వద్దకు రావడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులు కొన్నాళ్లుగా గొణుక్కుంటున్నారు. అవి ఇప్పుడు జగన్ చెవిలో పడ్డాయో లేకపోతే.. వాలంటీర్లపై నమ్కకం పోయిందో కానీ.. మంత్రులే సంక్షేమ పథకాలు అందివ్వాలని సూచించారు.
త్వరలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ ఇవ్వనున్నారు. ఇది మంత్రులే చేయాలని ఆదేశించారు. ఈ కంటెంట్ అంటే బైజూస్ ట్యాబ్స్ కావొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల వేడి పెరిగిపోయిందని.. ఇలాంటి సమయంలో మంత్రులు.. చాలా క్లియర్గా ఉండాలని ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని.. మీడియా రచ్చ రచ్చ చేస్తుదని చెప్పుకొచ్చారు. మంత్రులు కూడా అవినీతి అంటే ఏమిటన్నంత అమాయకంగా ఆ మాటలు విన్నారు.
కేబినెట్ సమావేశంలో ఆర్థిక సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు కానీ.. వచ్చే నెల ఒకటో తేదీన నుంచే సామాజిక పెన్షన్లను 2750కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి సగం మంది ఉద్యోగులకు జీతాలు రాలేదు. అయితే వచ్చే నెల కేంద్రం… కొత్త అప్పులకు అనుమతి ఇస్తుందని.. డబ్బులు పంచడానికి సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది.