ఏపీ సీఎం జగన్ రెడ్డి నిర్వాకాలు అన్ని వ్యవస్థల్లోనూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న కీలక వ్యక్తులకు ఆయన లంచాలు ఎర చూపినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల కిందట ఏపీ హైకోర్టులో పని చేస్తన్న ఓ న్యాయమూర్తికి రెండు కోట్ల విలువైనవజ్రాలు పొదిగిన వాచ్ను ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ న్యాయమూర్తి తిరస్కరించడమే కాదు సుప్రీంకోర్టుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర నిఘా సంస్థల సాయంతో విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం తాజాగా బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఖరీదైన బహుమతులను తీసుకుని వీరు న్యాయమూర్తుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు పిలవకపోయినా వెళ్తున్నారని.. బహుమతులు ఇచ్చి వస్తున్నారని అంటున్నారు. ఆ బహమతులు కోట్ల విలువైనవి కావడంతో ఆశ్చర్యపోకతప్పడం లేదు
ఈ బహుమతుల విషయంలో ఇంకా చాలా విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. జగన్ రెడ్డి అధికారంలో లేనప్పుడే న్యాయవ్యవస్థపై నిందలు వేసేవారు. తనకు వ్యతిరేకంగా వచ్చే తీర్పులును మేనేజ్ చేస్తే ఇచ్చారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక బరి తెగించాు. రాజ్యాంగ విరుద్ధంగా తాను తీసుకున్న నిర్ణయాలన కోర్టులు కొట్టి వేస్తే ఉద్దేశాలను ఆపాదించేవారు. చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే సమయంలో ఎన్వీ రమణపైనా తప్పుడు ఆరోపణలతో లేఖలు రాశారు. బయటపడనివి కొన్నే.. బయటపడాల్సిన లీలలు ఇంకా ఎన్నో ఉన్నాయన్న గుసగుసలు న్యాయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
అక్రమంగా సంపాదించడం..దాన్ని తలా కొంచెం పంచి.. తన దారికి అడ్డం లేకుండా చూసుకోవడం జగన్ రెడ్డి నైజం అని..దన్ని అన్ని వ్యవస్థలకూ అంటించేసి ఘోరమైన తప్పు చేశారన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయనకు తాత్కలికంగా లబ్ది కలగవచ్చు కానీ. దీర్ఘ కాలంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడతారో ముందు ముందు చూస్తారని ఆ రంగంలోని నిపణులు విశ్లేషిస్తున్నారు