తాను కష్టపడి బటన్లు నొక్కుతూంటే ఎమ్మెల్యేలు మొత్తం నాశనం చేస్తున్నారని జగన్ ఫీలవుతున్నారు., ఎమ్మెల్యేలతో ఎప్పుడు మీటింగ్ జరిగినా అదే వరుస. 19వ తేదీన మరోసారి అదే క్లాస్ పీకేందుకు ఎమ్మెల్యేలు ఇంచార్జులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.175 నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేల, వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్త లతో జగన్ సమావేశం అవుతున్నారు. ఇప్పటికే జగన్ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.తన గ్రాఫ్ బాగుందని ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని హెచ్చరిస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యేల పని తీరుపై ఎప్పటికప్పుడు జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎవరెవరు సీరియస్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఎవరు మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో పని తీరు గురించి కూడా జగన్ కొంత మందిపై అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాతో పాటు ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ నేరుగా వైఎస్ఆర్సీపికి ఇప్పుడు పని చేయడం లేదు. ఆయన సంస్థలో పని చేసే మరో కీలక వ్యక్తి రిషి రాజ్ పని చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పీకే టీముల్ని పంపి సర్వేలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నారు. ఈ నివేదికలు దాదాపుగా అరవై, డెభ్బై మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వెనుకబడిపోయిందన్న నివేదిక పీకే టీం జగన్‌కు ఇచ్చింది. అందుకే ఇటీవల జగన్ రెండు రోజుల పాటు వరుసగా సోషల్ మీడియా అంశంపై సమీక్ష చేశారు. సజ్జల కొడుక్కి బాధ్యతలిచ్చారు. ఎలా చూసినా మూడున్నరేళ్ల తర్వాత జగన్‌లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది.