2020-21 కి ఏపీ ప్రభుత్వ వ్యవహారాలపై అసెంబ్లీలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రవేశ పెట్టిన నివేదిక ఎంత రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుందో మరోసారి బయట పెట్టింది. ఇది పూర్తిగా పాలనా పరమైన అంశాల నివేదిక. ఆర్థిక వ్యవహారాలకు సంబంధిచిన నివేదిక. అప్పుల గురించి సర్టిఫై చేయలేదు. ఆ వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. కానీ ఇతర ఆర్థిక అవకతవకలు.. రాజ్యాంగ విరుద్ధంగా సాగుతున్న పాలన గురించి… ప్రజాధనాన్ని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారో కళ్ల ముందు ఉండేలా చేసింది కాగ్.
కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా.. ముఖ్యంగా తొలి సమీక్ష చేసిన ప్రజావేదిక హాల్ ను అదే వేదికపై నుండి.. అక్రమ కట్టడంగా తేల్చికూల్చి వేయించారు జగన్ రెడ్డి. అది పూర్తిగా ప్రజాధనంతో నిర్మించిన కట్టడం. అది అక్రమ కట్టడం కాదు. కానీ ప్రజల సొమ్ముపై ఏ మాత్రం బాధ్యత లేకుండా కూల్చివేయించి తన సైకోయిజానికి మొదటి సాక్ష్యం అక్కడే ఇచ్చారు. ఇప్పటికీ శిథిలాలు అక్కడే ఉన్నాయి. ఆ భవనాన్ని కూల్చేయడం వల్ల పదకొండు కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఇక అమరావతి నిర్మాణాలను ఆపేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో కూడా వివరించింది. అమరావతి నిర్మాణ యూసీలు సమర్పించకపోవడంతో .. పెండింగ్ నిధులు కేంద్రం విడుదల చేయలేదు. రాజధాని భూ సమీకరణ కోసం సీఆర్డీఏ రూ.2,244 కోట్లు ఖర్చు చేసిందని, సేకరించిన ఆ భూమి నేడు నిరుపయోగంగా ఉందని తెలిపింది. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే
ఇక గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని నేరుగా స్పష్టం చేసింది కాగ్. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం వల్ల రాజ్యాంగంలో నిర్దేశించినట్టు పౌరులకు, పాలనకు మధ్య వారధిగా ఉండాలనే వార్డు కమిటీ ఉద్దేశాన్ని, రాజ్యాంగ నిబంధనలను జగన్ ప్రభుత్వం నీరుగార్చిందిని కాగ్ స్పష్టం చేసింది. ఇలా మొత్తం రాజ్యాంగ ఉల్లంంఘనలతో జరిగిన పాలనను కాగ్ బయట పెట్టింది. లేబర్ సెస్ కింద రూ.55.39 కోట్ల వసూలు చేశారని.. ఆ సొమ్ముని ఏపీ భవన కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేయలేదని కాగ్ తప్పుబట్టింది. ఇలా కార్మికుల్నీ మోసం చేశారు.
కాగ్ రిపోర్టు ప్రకారం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏపీలో పాలన సాగుతోందని స్పష్టమైన మవుతోంది. మరి కేంద్రం, చక్కదిద్దాల్సిన వ్యవస్థలు ఎందుకు నిద్రపోతున్నాయో.. జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహించాలోప్రజలే తేల్చాల్సి ఉంది.