అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి జనంలోనే తిరిగారు. పొలాల్లోకి వెళ్లారు. బురదలోకి దిగారు. పాదయాత్ర చేశారు. పేదల ఇళ్లకు వెళ్లారు. ప్రతి పదిహేను రోజులకు ఓ దీక్, పేరు పెట్టుకుని ఏదో ఓ జిల్లాకు వెళ్లేవారు. ఆయన ప్రయత్నం ఫలించింది. అధికారం వచ్చింది. ఆ తర్వాత ఆయనేం చేశారు. ప్యాలెస్ కట్టుకుని అందులో ఉండిపోయారు. కనీసం ప్రజల్ని పలకరించేందుకు కూడా ఐదేళ్ల పాటు బయటకు రాలేదు.
అప్పట్లో అమ్మా ఫ్యాన్.. అయ్యా ఫ్యాన్.. తమ్ముడు ఫ్యాన్ అరుపులు – ఇప్పడు ప్యాలెస్ రాజభోగాలు !
జగన్ రెడ్డి తొమ్మిదేళ్ల పాటు రోడ్లపై తిరిగారు. తనను అధికారంలోకి తీసుకు వస్తే మీతో పాటే ఉంటానని ప్రజలకు నమ్మకం కలిగించారు. ఊరికో ప్యాలెస్ కట్టుకుని వాటిలో ఉండటం లేదని నమ్మ బలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ప్యాలెస్ కే అంకితమయ్యారు. తాడేపల్లిలో ఉత్తగోడలతో ఆయన నిర్మించున్న ప్రైవేటు నివాసానికి దాదాపుగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అదనపు హంగులు సమకూర్చుకున్నారు. ప్రైవేటు ఇంటికి ఇలా ఖర్చు పెట్టుకునేందుకు ఏ సీఎం అయినా మొహమాట పడతారు. కానీ జగన్ రెడ్డి మాత్రం అలా కాదు. ప్రజలు ఓట్లు వేసింది .. వారు పన్నులుగా కట్టిన సొమ్మును సొంతానికి వాడుకోమని అన్నట్లుగా వ్యవహరిస్తారు. అదే చేశారు.
ఒక్క ప్రజాదర్భార్ లేదు.. జిల్లాల పర్యటనలు లేవు. !
పని చేయని బటన్లు నొక్కని తప్ప జగన్ రెడ్డి ఎప్పుడూ జిల్లాలకు పోలేదు. తన సామాజికవర్గ నేతల చావులకు.. పెళ్లిళ్లకు అయితే మాత్రం వెళ్లారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలను కలవకపోతే ఫీల్ అవుతారు. కానీ జగన్ రెడ్డి తనకు తాను చక్రవర్తిగా ఫీల్ అవుతారు. తాను ప్రజల్ని కలవడం ఏమిటన్నట్లుగా ఉంటారు. అందుకే మొదట్లో సలహాదారు అత్యుత్సతాహంతో ప్రజాదర్భార్ అనే కార్యక్రమం ప్రకటించడంతో ఆయనకు చీవాట్లు పెట్టి క్యాన్సిల్ చేయించారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేయలేదు. ఎవర్నీ కలవలేదు. ఐదేళ్లు ఆయన వర్క్ ఫ్రం ప్యాలెస్. కేబినెట్ సమావేశాలకు తప్ప సచివాలయానికి ఎప్పుడూ రాలేదు.
ప్రజల్ని కలవని సీఎం కేసీఆర్కు పట్టిన గతే !
కేసీఆర్ కూడా అలాంగే ఫీలయ్యారు. ఆయన ప్రగతి భవన్ పేరుతో ఓ భవనం కట్టుకుని అందులో ఉండిపోయారు. ఎవర్నీ కలవలేదు. చివరికి సీఎం ప్రజల్ని కలవాల్సిన అవసరం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించే పరిస్థితికి వెళ్లింది. అయితే ప్రజలు ప్రజల్ని కలవని సీఎం ప్రజలకు ఎందుకని వద్దనుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డికి అదే తీర్పు ఇవ్వబోతున్నారు. తాన చేసిన పాలన సక్కగా ఉంటే ఆయన ప్రజల్లోకి వెళ్లి ఉండేవారు. అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి పావలా.. అర్థ పంచడం తప్ప.. జగన్ రెడ్డి చేసిందేమీ లేదు.