సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం ఢిల్లీకి వెళ్లి మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అమిత్ షా నివాసంలోకి వెళ్లిన ముప్పావు గంట తర్వాత బయటకు వచ్చారు. జగన్ రెడ్డి వెంట వెళ్లిన బృందంలో ఒక్క ఎస్ ఎస్ రావత్ తప్ప అందరూ ఆంతరంగీకులే. ఆర్థిక సాయం.. అప్పులు..కాగ్ రిపోర్టులువంటి అంశాలపై వివరణ ఇవ్వడానికి ఆ శాఖ మఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ను వెంట తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే అమి త్ షాతో జగన్ భేటీ మాత్రం ముఖాముఖి జరిగింది. ల
జగన్ వెంట విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, సీఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి ఉన్నారు. గత ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అయ్యారు. ఈ పర్యటన మోటివ్ ఏమిటో మాత్రం ఇంకా బయటపడలేదు. సునీతా రెడ్డి వేసిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. సుప్రీంకోర్టులో సీజేఐ బెంచ్ ముందు విచారణకు రావాల్సి ఉంది.
మరో వైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. అప్పుల పరిమితి దాదాపుగా ముగిసిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇలా బండి లాగించడం సాధ్యంకాదు. అందుకే ఎన్నికలకు వెల్తే ఎలా ఉంటుందా అని కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తామని సహకరించాలని అడిగేందుకే.. జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్న ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. ప్రధానితో భేటీ తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.