అవును..జగన్ కు ఐదేళ్లదాకా అస్త్రాలు లేవు..చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించడం పెద్ద టాస్కే..జగన్ ఈ స్థాయికి రావడానికి కారణం అప్పట్లో జరిగిన ప్రత్యేక పరిణామాలు, పరిస్థితులు, వైఎస్ మరణం, కాంగ్రెస్ లో వారి కుటుంబానికి అవమానం, సింపతి, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, అప్పటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో పార్టీకి స్పేస్ ఉండటం.. అన్నీ కలిసొచ్చాయి.. పార్టీ ఎదగడానికి సహకరించాయి.. కానీ ఇప్పుడు ఏవీ లేవు.. సంక్షేమం తప్ప.. గడిచిన ఐదేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి కూడా లేదు.. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన ఏం చేయలేరు.. అవకాశాల కోసం కాసుకుని కూర్చోవడమే తప్ప..చేసేదేం లేదు.
వైసీపీ ఓడిపోగానే ప్రజలు ఏపీకి స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఫీల్ అయ్యారంటేనే జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూటమి సర్కార్ లోని చిన్న, చిన్న లోపాలను జగన్ రెడ్డి ఎత్తిచూపినా వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. పైగా..చంద్రబాబు రాష్ట్రాభివృద్దిని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. పోలవరం, అమరావతి ప్రాధాన్యత అంశాలుగా ముందుకు సాగుతున్నారు. అప్పుల సమస్య వేధిస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలోనూ ఉన్నారు. నెల రోజుల చంద్రబాబు పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళులా భావిస్తుండటంతో జగన్ కు ఎలాంటి ఛాన్స్ లేకుండా పోతోంది.
ఓ నెల రోజుల్లోనే పాలనలో చంద్రబాబు తన మార్క్ చూపించారు. రానున్న ఐదేళ్లలో ఏపీని అభివృద్ధి పథంలో నిలుపుతామని సంకేతాలు ఇస్తున్నారు. ఇదే చంద్రబాబు విజనరీ పాలన ప్రజలకు ఓ నమ్మకాన్ని కుదుర్చుతోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో చంద్రబాబు పాలనలో లోపాలను వెతుకుదామని అనుకుంటున్నా జగన్ ఆ అవకాశం లేకుండా పోతోంది. దీంతో చంద్రబాబు ఇరుకున పెట్టేందుకు రాజకీయం చేయాలనుకుంటున్నా జగన్ కు ఎలాంటి ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు.
పైగా ఈసారి చంద్రబాబు రాజకీయంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు.. వైసిపి వాళ్లు వస్తామని బ్రతిమిలాడుతున్న ఆయన పట్టించుకోవడం లేదు.. ఇక చంద్రబాబు బిజెపితో కలిసి ఉండడంతో జగన్ కూటమి ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేసే సాహసం కూడా చేయకపోవచ్చు. ఆయన ఏ మాత్రం డోస్ పెంచినా కేంద్రం నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు.. ఇక చంద్రబాబు ఎన్డీయేలో కీలక పాత్ర పోషిస్తున్నడంతో ఏపీకి కావలసిన పనులన్నీ చక చకా చేయించుకుంటున్నారు. దీంతో జగన్ కు ఏ చంద్రబాబును డీకొట్టేందుకు ఎటువంటి అవకాశం లభ్యం కావడం లేదు.