ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం బహిరంగసభలు పెట్టి పూర్తిగా రాజకీయ విమర్శలకే సమయం కేటాయిస్తున్నారు. కావలిలో చుక్కుల భూమలు సమస్యలకు పరిష్కారం అంటూ సభ పెట్టారు. అసలు విషయం కన్నా.. ఆయన మొత్తం రాజకీయంపై తన ఫ్రస్ట్రేషన్ ను బయట పెట్టుకుని టీడీపీ గెలిచేస్తుందని.. ఓట్లు వేయవద్దని వేడుకోవడం…బ్లాక్ మెయిల్ చేయడం.. చివరికి తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారిపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వరకూ వచ్చారు. జగన్ ప్రసంగం విని వైసీపీ క్యాడర్ కూడా జావ కారిపోయే పరిస్థితి వచ్చింది.
చంద్రబాబు, పవన్ గెలిచేస్తున్నారన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు !
పొత్తుల ఖాయమని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో జగన్ లో ఫ్రెస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. కావలి సభలో ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరూ మోసగాళ్లని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గెలిస్తే స్కీములు రావని ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. పేదలకు డబ్బు పంచడం బాధ్యతారాహిత్యమని టీడీపీ, వారి తోటివారు ఆరోపిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. టీడీపీకి ఓటు వేయడమంటే సంక్షేమ పథకాలు రావని అర్ధమన్నారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే, దోచుకో పంచుకో తినుకోగా సాగుతారని ఆరోపించారు. చంద్రబాబు గెలిస్తే అనే మాట తరచూ వాడటం .. జగన్ కు వచ్చిన క్లారిటీని సూచిస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
బిడ్డకు అండగా ఉండాలంటూ వేడుకోళ్లు !
గతంలో సీఎం జగన్ నా వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడేవారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మీ బిడ్డకు అండగా ఉండాలంటూ ప్రాథేయపడుతున్నంత పని చేస్తన్నారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదవాళ్లు బతకరని జగన్ హెచ్చిరించారు. మీ ఇంట మంచి జరగాలంటే, మీ బిడ్డకి మీరే సైనికులుగా ఉండండని దీనంగా అడిగినంత పన ిచేశారు. జగన్ వేడుకోళ్లు చూసి ఇంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చామా అని సభకు వచ్చిన వైసీపీ క్యాడర్ కూడా అనుమానపడింది.
చివరికి జీవీ రావు అనే వ్యక్తిపైనా విమర్శలు
సీఎం జగన్ ఎంత ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారో ఆయన స్పీచ్ లోనే బయటపడింది. ఈనాడుకు ఇంటర్యూ ఇచ్చిన జీవీ రావు ఆనే ఆర్థిక నిపుణుడిపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నుంచి వచ్చారంటూ లేకిగా మాట్లాడారు. నిజానికి ఆ జీవీ రావు సాక్షిలో బిజినెస్ అనలిస్ట్. దాని వల్లే ఆయనకు గుర్తింపు వచ్చింది. చివరికి ఆయనను విమర్శించి.. తన స్థాయి ఎక్కడో లోతులో ఉందని సీఎం జగన్ నిరూపించుకున్నారన్న సెటైర్లు పడుతున్నాయి.
మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ముఖ కవళికలు.. ఆయన మొహం పాలిపోయి ఉండటం .. ఏ మాత్రం ఉత్సాహం లేకుండా ఆందోళన స్వరంతో ఇస్తున్న ప్రసంగాలు చూసి వైసీపీ క్యాడర్ కూడా .. ఏదో తేడాగా ఉందే అనుకుంటోంది.