కాంగ్రెస్ కు .. వైసీపీ మధ్య మ్యూచువల్ అండర్ స్టాండింగ్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. వైసీపీకి మైలేజీ ఇచ్చేందుకు కాంగ్రెస్ చాలా కష్టపడుతోంది . పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ను స్పీకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్ కు ప్రత్యేక ప్యాకజీని జేడీయూ డిమాండ్ చేశారని.. అలాగే ఏపీకి ప్రత్యేకహోదాను విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారని .. కానీ టీడీపీ మాత్రం అడగలేదని.. జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. పక్కాగా వైసీపీకి కాంగ్రెస్ ఓ హోదా ఇచ్చేందుకు రెడీ అయిందని అర్థం ఈ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉంది. బీజేపీకి అన్ని సార్లు సహకరించింది. రాజ్యసభలో షరతులు లేని మద్దతు ఇచ్చింది. అయినా ఒక్క సారి కూడా ప్రత్యేకహోదా అడగలేదు. ఇప్పుడు కూడా బహిరంగ వేదికల మీద అడగడం లేదు. ఆల్ పార్టీ మీటింగ్ లో అడిగారో లేదో తెలియదు.. కానీ వైసీపీ కంటే ముందే.. కాంగ్రెస్ నేతలు.. వైసీపీ హోదా అడిగిందోచ్ అని ప్రచారం ప్రారంభించారు. వైసీపీని దగ్గరకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగానే కనిపిస్తోంది. దానికి జగన్ కూడా రెడీగా ఉన్నారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
Also Read : వైసీపీ ఫేడవుట్ పాలిటిక్స్
ఏపీలోని ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడం వెనుక కూడా… కాంగ్రెస్ తో దగ్గరయ్యే వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు. షర్మిల తన పార్టీకి పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నందున ఓటు బ్యాంక్ ను కాపాడుకోవడానికైనా .. జగన్ .. కాంగ్రెస్ దగ్గరయినట్లుగా సంకేతాలు పంపుతారని అంటున్నారు. దీన్ని బీజేపీ ఎలా తీసుకుటుందన్నదే కీలకం.