ఈ సారి గెలిస్తే మనమే 30 ఏళ్లు సీఎం అని జగన్ కలలు కంటున్నారు . ఆ కలల్ని పార్టీ నేతలకూ పంచుతున్నారు. నియోజకవర్గ సమీక్షల్లో అదే చెబుతున్నారు. ఈ సారి గెలిస్తే మనదే ముఫ్పై ఏళ్ల అధికారం అంటున్నారు. జగన్ లాజిక్ ఏమిటో వైసీపీ నేతలకు క్లారిటీగానే ఉంది.. అదేమిటంటే.. ఈ సారి టీడీపీ గెలవకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి వయసు కారణంగా ఆయన యాక్టివ్‌గా ఉండలేరు. ఇక ప్రత్యామ్నాయ నాయకత్వం ఉండదు. అందుకే ఇక తానే కింగ్నన్న భావనలో జగన్ ఉన్నారని వారికి క్లారిటీ వచ్చేసింది.
చంద్రబాబునాయుడు వయసు 70 ఏళ్లు దాయిపోయింది. ఆయన మహా అయితే 2024 ఎన్నికల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటారని..2029 ఎన్నికల నాటికి వయసు కారణంగా చురుగ్గా రాజకీయాలు చేయలేరని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇక రాజకీయ ప్రత్యర్థి ఉండరని జగన్ అనుకుంటున్నారని అంటున్నారు. లోకేష్ రాజకీయంగా జగన్‌తో ఢీ కొట్టే రేంజ్‌కు వెళ్లలేదని..అలాగే పవన్ కల్యాణ్‌కు అన్ని వర్గాల్లో ఆమోదం లభించదని.. వారితో పోలిస్తే తానే లీడర్‌గా ఉంటానని అనుకుంటున్నారు. ప్రత్యామ్నాయం లేక తననే ఎన్నుకుంటారని జగన్ అంచనా వేస్తున్నారు.
గతంలో చంద్రబాబు కూడా ఇలాగే అనుకునేవారు. తాను బీభత్సమైన అభివృద్ధి చేస్తున్నానని బెంగాల్లో జ్యోతిబసులాగా వరుసగా గెలుస్తానని అనుకున్నారు. కానీ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చంద్రబాబుకు మరో ఎన్నికలోనే తెలిసి వచ్చింది. ఇప్పుడు జగన్ అభివృద్ధి కాకుండా ఇంటింటికి డబ్బులు పంచుతున్నా కాబట్టి… గెలిపించేస్తారని.. ప్రత్యామ్నాయ నాయకత్వం ఉండదు కాబట్టి.. గెలిచేస్తానని అనుకుంటున్నారు.
కానీ రాజకీయాలంటేనే డైనమిక్. ఈ రోజు ఉండే పరిస్థితులు రేపు ఉండవు. ఆ విషయం సీఎం జగన్‌కూ తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వైఎస్ఆర్సీపీ శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అయినా కానీ 30 ఏళ్ల ఆశను మాత్రం బయట పెట్టుకోకుండా ఉండలేకపోతున్నారు.