ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాడేపల్లిలో కట్టుకున్నప్యాలెస్ నుంచి జగన్ రెడ్డి పాలన చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. తన ఇంటినే క్యాంప్ ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. అయితే ఆయన ఆ ఇంటికి వచ్చే ముందు అక్కడ మొండిగోడలు మాత్రమే ఉన్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాధనం పెట్టి మొత్తం సౌకర్యాలు కల్పించుకున్నారు. ఎలా అంటే.. చివరికి కిటీకీలు కూడా ప్రజాధనం పెట్టే కొనుగోలు చేశారు.
సీఎం అయిన తర్వతా ఇంటికి కిటికీల కోసం ఖర్చు అయిందంటూ.. ఏకంగా.. రూ.73 లక్షల రూపాయలు విడుదల చేశారు. వ్యూ కట్టర్ పేరుతో… మరో ఏర్పాటు చేశారు. దీని కోసం.. ఏకంగా.. మూడున్నర కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఓ బాత్రూమ్ నిర్మాణానికి రూ. 30 లక్షలు కూడా రిలీజ్ చేశారు. ఇంట్లో ఏసీలు, ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం.. దాదాపుగా రూ. 3 కోట్ల 63 లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేశారు. ఐదేళ్ల ముందుతో పోలిస్తే కనీసం యాభై కోట్లు పెట్టి ప్యాలెస్‌కు మెరుగులు దిద్దించుకున్నారు.
ఇన్ని కోట్లు పెట్టింది… కూడా.. ముఖ్యమంత్రి ప్రైవేటు ఆస్తికి మెరుగులు దిద్దడానికే. జగన్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు ప్రభుత్వ ఆస్తి కాదు. నిజానికి.. జగన్ ఇంటి కోసం మంజూరు చేసిన నిధులతో.. ఓ విలాసవంతమైన ఇల్లునే నిర్మించవచ్చు. ఇప్పుడు జగన్ ఆ ఇంటిని పార్టీ కార్యాలయంగా ప్రకటించుకున్నారు. అంటే … ఆ ఇంట్లో ప్రజాధనం యాభైకోట్లుగా ఉంది కాబట్టి.. వాటిని చెల్లించాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.. లేకపోతే.. ప్రభుత్వం ఖర్చు పెట్టి కొన్న ప్రతి వస్తువును పగలగొట్టి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి.