పులకేశి ఎక్కడైనా పులకేశినే. ఆయన రాజ్యాన్ని నడిపినా..పార్టీని నడిపినా. ఈ మాట ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది వై నాట్ 175 అని కుప్పంలో గోడలపై రాయించి బెంగళూరు నుంచి కిరాయి మూకలతో బైక్ ర్యాలీలు నిర్వహించిన రేంజ్ నుంచి… నాకు ప్రతిపక్ష హోదా, సీఎం రేంజ్ భద్రత కావాలని హైకోర్టులో పిటిషన్లు వేసేవరకూ జగన్ పతనం సాగుతోంది. ఇంకా అది పడిపోతూనే ఉంది. ఎక్కడ దాకా ఆ పతనం ఉంటుందో జగన్ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన రియలైజ్ కాలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు తాను చేసిన అతికి… ఇప్పుడు తాను చేస్తున్న అత్యంత అతికి అసలు పొంతనే లేదన్న సంగతిని గుర్తించడానికి కూడా వెనుకాడటం లేదని క్యాడర్ గగ్గోలు పెడుతున్నారు
ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్లడమేంటయ్యా !
ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ పిటిషన్ విచారణ అర్హత తేల్చాలని ముందుగా నిర్ణయించారు. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. కానీ రాజ్యాంగం పై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా… స్పీకర్ ను కోర్టులు ఆదేశించలేవు అనే విషయంపై మాత్రం స్పష్టతతో ఉంటారు. అంటే.. స్పీకర్ తప్ప ఎవరూ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు. ఎందుకంటే ప్రజలు ఇవ్వలేదు. కనీస మంచి మర్యాద లేని జగన్ కు పాలు పోయారని టీడీపీ ఎందుకు అనుకుంటుంది ?. భద్రత విషయంలోనూ అంతే. కోర్టు విచారణ జరిపి ఏం ఆదేశించిందో జగన్ విశ్లేషించుకుంటే… తన రేంజ్ తెలుస్తుంది.
Read Also : జగన్ కు అదే భద్రత… వాహనం మారింది అంతే!
నిలువెల్లా విషమున్న లీడర్‌కు పాలు పోస్తారా ?
అసలు తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చి, సీఎం రేంజ్ సెక్యూరిటీ ఇచ్చి గౌరవించాలని జగన్ కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఆయన ఎవర్నీ గౌరవించలేదు కాబట్టి. దేశంలో అత్యంత ఘోరమైన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేతల్లో జగన్ మొదటి ప్లేస్ లో ఉంటారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అన్ని ఆయన డైరీలో ఉండరు. గౌరవం కావాలనుకుంటారు కానీ ఇవ్వరు. కానీ ఆయనకు తెలిసి వచ్చేదేమిటంటే… ఆయన ఎంత ఈగోకు పోతారో అంత కంటేఎ క్కువ పరువును ప్రజలు తీస్తారు., ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం దానికి సాక్ష్యం. జగన్ ఇప్పటికైనా రియలైజ్ అయి..తన పోరాటం తాను చేసుకుంటారనుకుంటే… మొత్తానికే తన ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వాలంటూ… పిల్లల మాదిరి రచ్చ చేస్తున్నారు.
ఇలా అడుక్కుంటే వ్యక్తిత్వమే లేదని అర్థం కాదా ?
జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం చేస్తున్నపోరాటం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వైసీపీలో సీనియర్లు అంతా ఏమైపోయారని.. జగన్ ను ఎందుకు ఇలా రోడ్డున పడేస్తున్నారని … కమెడియన్ ను చేస్తున్నారని వారనుకుంటున్నారు. వై నాట్ 175 పేరుతో చేసిన హడావుడి ఇంకా కళ్ల ముందే ఉంటే.. ప్రతిపక్ష హోదా కావాలంటూ.. కోర్టులకెక్కె పరిస్థితికి వచ్చినా ఎందుకు జగన్ ను రైట్ ట్రాక్‌లో పెట్టేందుకుప్రయత్నించడం లేదని అనుకుంటున్నారు. కనీసం ఆయనైనా అనుకోవాలి కదా.. తాను పతనాన్ని తానే అందరికీ గుర్తు చేస్తున్నానని.. సిగ్గుపడాలి కదా !