ముఖ్యమంత్రిగా జగన్ ెడ్డి చేతకాని.. ప్రాధన్యతలు తెలియని వైనం ఏపీకి శాపంగా మారింది. ఆరేడు నెలలు అయినా .. జగన్ రెడ్డి చేసి పోయిన నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం వల్ల కావడం లేదు. ప్రతి పథకంలోనూ బకాయిలు పెట్టిపోయారు. పిల్లల ఫీజుల రీఎంబర్స్ మెంట్ నుంచి ఆరోగ్యశ్రీ వరకూ అన్ని చోట్ల వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఇప్పుడు వాటిని తీర్చకపోతే సమస్యలు వచ్చి పడుతున్నాయి.
ఆరోగ్యశ్రీ బకాయిలను గత ప్రభుత్వం మూడువేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది. ఆస్పత్రి యాజమాన్యాలను బెదిరించడంతో అప్పట్లో డబ్బులు అడగకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందేనని మీదకెక్కి కూర్చుకుంటున్నారు. వారికి జగన్ రెడ్డి సపోర్టుగా ట్వీట్లు పెడుతున్నారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పది వేల కోట్లు ఖర్చు పెడితే.. అందులో మూడువేల కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే ఈ పథకాన్ని అప్పుల ఖాతాలో ఎలా రాసేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇతర పథకాల విషయంలోనూ అంతే.
కేంద్రం ఎంత సహకరిస్తున్నా.. ఆదాయం పెరుగుతున్నా సరే.. పదేళ్ల పాటు చేసిన నిర్వాకాలను ఆరు నెలల్లో సరి చేయడం అంత తేలిక కాదు. కానీ వీలైనంత వరకూ పరిస్థితుల్ని గాడిలో పెట్టారు. ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అవన్నీ తాము తెచ్చిపెట్టిన సమస్యలే అని తెలిసినా .. ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రెస్మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ తీరు చూసి ప్రజలు కూడా ఔరా అనుకోవాల్సి వస్తోంది.