మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చాలా కాలంగా మంత్రి జోగి రమేష్ తీరుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సొంత నియోజకవర్గంలో పని చేసుకోనివ్వకుండా చేస్తున్నారని ఆయన నేరుగా హైకమాండ్ పెద్దలకే ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత వివాదాస్పద కామెంట్లు చేశారు. అయినా వసంతనే దూరం పెట్టారు. జోగిని ప్రోత్సహించారు. చివరికి జోగి రమేష్ కే టిక్కెట్ అన్నట్లుగా అభయం కూడా ఇచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో వసంత ఇక సైలెంట్ అయిపోయారు. గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహిచండం లేదు.
ఇంత కాలం పట్టించుకోని సీఎం జగన్ … కేబినెట్ భేటీలో జోగి రమేష్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది. పక్క నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని మండి పడినట్లుగా ప్రో వైసీపీ మీడియా ప్రచారం చేయగానే.. తర్వాతి రోజే.. వసంత కృష్ణప్రసాద్ కు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన తో భేటీలో అసలు జోగి రమేష్ కంటే తనకు వసంత కృష్ణ ప్రసాదే ముఖ్యమమన్నట్లుగా జగన్ కూల్ చేసి పంపించారు. ఆయన మాటలు విని.. గతంలో కోటంరెడ్డిలా వసంత ఫీల్ అయ్యారో లేదో కానీ… తాను పార్టీలు మారే వాడిని కాదని కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
పార్టీలో అసమ్మతి పెరిగిపోతోందని పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బయటకు వస్తాయని ప్రచారం జరుగుతున్న సమయంలో .. ఇలా అసంతృప్తి ఎమ్మల్యేల్ని వీలైనంత వరకూ బుజ్జగించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు . ఇంత కాలం తాము చెప్పిటన్లుగా అందర్నీ తిట్టి.. చంద్రబాబు ఇంటిపైకి కూడా దాడికి వెళ్లిన జోగి రమేష్ కే ప్రాధాన్యం ఇచ్చినా ఇప్పుడు మాత్రం వసంతకు ఆ స్థానం ఇచ్చారు. జగన్ తీరుపై జోగి వర్గీయుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.