ఏపీ సీఎం జగన్ స్వరూపానంద కోరికను మన్నించలేకపోయారు. ఆయనపై కోపం వచ్చిందా లేకపోతే.. అధికారులు ఇరుక్కుపోతామని భయపడ్డారా అన్నది తెలియదు కానీ.. .స్వరూపానంద కోరికను మాత్రం తీర్చలేదు.
విషయం ఏమిటంటే.. భీమిలీ సమీపంలో ఏకంగా పదిహేను ఏకరాలను శారదాపీఠానికి ప్రభుత్వం రాసిచ్చింది . ఆ భూములను ఆధ్యాత్మిక ప్రచారానికి మాత్రమే వాడుకోవాలని తెలిపింది. అయితే శారదాపీఠం స్వరూపానంద…తాము చాలా చోట్ల ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తున్నామని… భిమీలి భూముల్లో మాత్రం వ్యాపారం చేస్తామని అనుమతి ఇవ్వాలని దరఖాస్తు పెట్టింది. ఈ దరఖాస్తు కాస్త విచిత్రంగా ఉండటంతో… అధికారులు అటూ ఇటూ ఊగిసలాడారు.
ఎన్నికల కోడ్ వచ్చే వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు.కోడ్ వచ్చిన తర్వాత తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన భూమిని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడుకోవాలని స్పష్టం చేశారు. అయితే అసలు ఆ భూమి అధ్యాత్మిక ప్రచారానికి అవసరం లేదని.. చాలా చోట్ల చేస్తున్నామని చెప్పారు కాబట్టి… ఆ భూకేటాయింపును రద్దు చేయాల్సింది. కానీ … ఆ పని చేయలేదు.