జగన్ రెడ్డి సీఎం అవగానే ఆయనకు తనంత విధేయుడు.. ఆత్మీయుడు ఎవరూ ఉండరన్నట్లుగా వ్యవహరించారు ఐఏఎస్ ఆధికారి ఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్. ఆయన ఉత్సాహాన్ని జగన్ రెడ్డి సంపూర్ణంగా వాడుకున్నారు. అమరావతి నిర్ణయాల్లో చేసిన తప్పుడు వ్యవహారాలన్నింటికీ ఆయననే ముందు పెట్టారు. తప్పుడు నివేదికలను వివిధ సంస్థలతో ఇప్పించడంలో ఆయనదే కీలక పాత్ర. ఇందుకు ప్రతిఫలంగా టిక్కెట్లు ఆఫర్ చేశారేమో కానీ.. ప్రతి సమావేశంలో జగన్ రెడ్డిపై పొగడ్తలు.. టీడీపీ నేతలపై విమర్శలు చేసేవారు.
అయితే ఆయన ఇప్పుడు రోడ్డున పడ్డారు. టిక్కెట్ల కేటాయింపులో ఆయన పేరు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. పాదయాత్ర చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తే అదీ చేశారు. కానీ పట్టించుకోవడం దీంతో ఆయన కూడా తాను మోసపోయానని అనుకున్నారేమో కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు అన్యాయానికి గురయ్యారని మాట్లాడటం ప్రారంభించారు. కామెడీ ఏమిటంటే ఆయన అంతకు ముందు కూలీ మీడియా అటెన్షన్ పొందేవారు. ఈ సారి వారు ఆయనను పట్టించుకోవడం లేదు. నాగార్జున యూనివర్శిటి ముందు దళితలతో సభ నిర్వహించినా పట్టించుకోవడం లేదు.
దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని జగన్ రెడ్డి వాడుకున్నట్లుగా ఎవరూ వాడుకోలేదు. వారిని ముందు పెట్టి తన రాజకీయ లక్ష్యాన్ని అందుకుంటున్నారు. చివరికి వారంతా బలి పశువులు అయ్యే పరిస్థితి వస్తోంది. రిటైర్ అయినా… ప్రభుత్వం మారితే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన.. వారిలో ఇప్పటికే ప్రారంభమై ఉంటుంది.