నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రకటనలకు మాత్రమే… తెర ముందు కనిపిస్తున్నారు. అయితే.. తన శాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో.. ఆయన పాత్ర నామమాత్రంగా కనిపిస్తోంది. నిర్ణయాల్లో మాత్రమే కాదు.. కనీసం.. తనకు సంబంధించి జరుగుతున్న అత్యంత కీలక సమావేశాల్లోనూ ఆయన కనిపించడం లేదు. దానితి తాజా ఉదాహరణ.. ఢిల్లీ పర్యటనే. ప్రధాని నరేంద్రమోడీని కలిసి.. ఏపీ సమస్యలను విన్నవించి పరిష్కారం కావాలని విజ్ఞప్తి చేసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి బృందంలో.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లేరు. జగన్మోహన్ రెడ్డి ఎజెండాలో.. పోలవరంది ప్రధానమైన పాత్ర. పోలవరం విషయంలో.. ఏం జరిగిందో.. ప్రధానికి వివరించి.. తమ లక్ష్యం ప్రకారం.. కొత్త టెండర్లను పిలవడానికి.. మోడీని ఒప్పించాల్సి ఉంది. కానీ సీఎం జగన్ మాత్రం.. పోలవరంపై అత్యున్నత భేటీలు ఉన్నప్పటికీ.. మంత్రి అనిల్ ను దూరం పెట్టారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీకి ముందు… ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో జగన్.. గంట సేపు భేటీ అయ్యారు. ఈ సమయంలో.. ప్రధానంగా… పీపీఏల రద్దు.. పోలవరం ప్రాజెక్ట్ పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేయడం… ఆ తర్వాత పరిణామాలపై.. పీఎంవో అధికారులకు జగన్.. సుదీర్ఘంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ సమయంలో… ఆ వివరణ బాధ్యతను.. జగన్ తో పాటు.. ఆయనతో వచ్చిన అధికారులు తీసుకున్నారు . సంబంధిత మంత్రి మాత్రం.. జాడలేదు. అసలు ఆయనను తీసుకెళ్లాలనే ఆలోచన కూడా సర్కార్ పెద్దలు చేయలేదు. అంతే కాదు.. తెలంగాణతో కలిసి చేపట్టబోతున్న ప్రాజెక్ట్ గురించి కూడా.. ప్రధాని కార్యాలయ సిబ్బందితో చర్చించారు. అయినా అనిల్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఇదొక్కటే కాదు.. ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలు ఏవీ… అనిల్ కుమార్‌కు తెలియడం లేదు. ఆయన కూడా… తాను పేపర్లో చూసి తెలుసుకోవావాల్సి వస్తోందని… సెటైర్లు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి.. ప్రాజెక్టులు, టెండర్లు, కాంట్రాక్టర్లకు… మొదటి నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన టీం.. ఈ శాఖ వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది. దాంతో.. జలవనరుల మంత్రిగా అనిల్ కుమార్ కు.. హోదా మాత్రమే ఉంటోంది. పని మాత్రం ఉండటం లేదు. అందుకే.. ఆయన.. క్షేత్ర స్థాయి పర్యటనలకు.. అంటే.. నియోజకవర్గానికే ఎక్కువ పరిమితం అవుతున్నారు.