” చిన్న పిల్లలు మిత్రుల మీదో.. అక్క మీదో .. చెల్లి మీదో కోపం వస్తే… నేను మొన్న నీకు బిస్కెట్ ఇచ్చాను. అయినా ఇవాళ కొట్టావు.. నా బిస్కెట్ నాకిచ్చెయ్” అని గోల చేస్తారు. వాళ్లను పెద్ద పిల్ల చేష్టలు అని అదిలిస్తారు. పెద్దయిన తర్వాత కూడా అవే పిల్ల చేష్టలు చేస్తే ఎవరు అదిలిస్తారు ?. అదీ కూడా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి సొంత కుటుంబంపై ఇలాంటి చేష్టలకు దిగితే ఏమనుకోవాలి ?. ఇప్పుడు జగన్ రెడ్డి అదే చేస్తున్నాం. జనం అంతా ఆయన వైపు నోరెళ్ల బెట్టి చూస్తున్నారు.
హవ్వ.. షర్మిల వ్యతిరేకత వ్యాఖ్యలు చేస్తోందని ఎన్సీఎల్టీలో పిటిషన్ వేస్తారా ?
జగన్ రెడ్డి ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ చూస్తే.. ఎంత అపరిపక్వ మైండ్ సెట్‌తో ఉన్నారో అర్థమవుతుంది. తనను షర్మిల వ్యతిరేకిస్తోంది కాబట్టి తాను గిఫ్ట్ డీడ్ చేసినవి రద్దు చేసుకుంటానని ఆయన వాదిస్తున్నారు . అలా ఎవరైనా ఎన్సీఎల్టీకి వెళ్తారా ?. ఎన్సీఎల్టీకి అదే పనా ?. లాయర్లు అయినా జగన్ రెడ్డికి చెప్పి ఉండరా అంటే.. చెప్పే ఉంటారు. కానీ మేనేజ్ చేసుకోవడం నాకు తెలుసన్నట్లుగా ఆయన ధీమా ఉంటుంది. లేకపోతే ప్రతి చిన్న కేసుకూ సీఎంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయేవారు. అదే మైండ్ సెంట్ . ఏ మాత్రం మారలేదు.
ప్రజా జీవితంలో పరువు పోయినా పంతమే ముఖ్యం
జగన్ రెడ్డి మనస్థత్వం పగ, ప్రతీకారాలు తీర్చుకోవడం. తనకు ఒక కన్ను పోయినా.. ఎదుటివాడికి రెండు కళ్లు పోవాలనుకునే ఘోరమైన వ్యక్తిత్వం. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ఇష్టారీతిన తనకు ఇష్టం లేని వారందర్నీ వ్యతిరేకించారు. ఇప్పుడు సొంత తల్లి, చెల్లిని కోర్టుకు లాగారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే పరువు పోతుంది. అయినా సరే జగన్ రెడ్డి ఈ ఇష్యూను అంతర్గతంగా ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం కాలేదు. కోర్టుకెళ్లారు.
చెల్లికి రాజకీయ భవిష్యత్ ఉండకూడదా ?
రాజకీయాల నుంచి విరమించుకుంటేనే ఆస్తి రాసిస్తానని జగన్ రెడ్డి షరతులు పెట్టారు. తండ్రి అధికారంలో ఉండగా సంపాదించిన అక్రమాస్తులన్నీ నలుగురు మనవళ్లు, మనవరాళ్లకే చెందుతాయని వైఎస్ విజయమ్మ సాక్షిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెబితే జగన్ అంగీకరించారు. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ తన స్వార్జితం అని వస్తున్నారు. తండ్రి మాట ప్రకారం షర్మిల ఇక రాజకీయం చేయకూడదట. జగన్ మనస్థత్వం చూసి సామాన్యులంతా … పిచ్చి చేష్టలు అనుకునే పరిస్థితి వచ్చింది.