వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పటికి తాను ఏది అనుకుంటే అదే నిజం అనుకుంటున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడంలేదు. సభా వ్యవహారాల విషయంలో కోర్టు చెబితే తనకు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేయాల్సిందేనని.. అనర్హతా వేటు వేస్తే కోర్టులకు వెళ్తామని ఆయన అమాయకంగా చెబుతున్నారు. రాజ్యాంగం గురించి ..సభా హక్కుల గురించి ఇంత కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడుతారో వైసీపీలోని జూనియర్ నేతలకూ అర్థం కావడం లేదు. సీఎంగా పని చేసిన వ్యక్తికి ఉన్న అవగాహన ఇదేనా అని ఆశ్చర్యపోతున్నారు..
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించవు !
భారత రాజ్యాంగం శాసనసభకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సభా నిర్వహణ వరకూ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. సభా నియమాలు, సంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. ఫలానా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. ఫలానా వ్యక్తిని స్పీకర్ ను చేయాలి.. సభలో ఫలానా విధంగా జరిగింది కాబట్టి మేము చెప్పినట్లుగా చేయాలి అని కోర్టులు ఆదేశించలేవు. ఆ అధికారం వారికి లేదు. సభా వ్యవహారాల్లో పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుంది. జగన్ రెడ్డికి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవడం విచిత్రమేమీ కాదు.. ఆయన తాను అనుకున్నదే నిజం అనుకుంటారు.., సజ్జల లాంటి వాళ్లు చెప్పిందే కరెక్టనుకుంటారు.
రూల్స్ ప్రకారం అనర్హతా వేటు వేసినా కోర్టులు ఆపవు !
అనర్హతా వేటు వేస్తే తాను రెడీ అని.. జగన్ రెడ్డిఅన్నారు. అంటే ఉపఎన్నికలు ఎదుర్కొంటారని అందరూ అనుకుంటారు.కానీ ఆయన మాత్రం కోర్టుకెళ్తామంటున్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎలాంటి అనుమతి తీసుకోకుండా మూడ్ సెషన్స్ లేదా 90 రోజుల అసెంబ్లీకి గైర్హాజర్ అయితే అనర్హతా వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంది. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలుపై చర్చించాలని ప్రజలు ఓటు వేస్తే.. ఆ పని చేయకుండా.. రూల్స్ ప్రకారం అనర్హతా వేటు వేస్తే.. వేయవద్దని కోర్టులు ఎలా చెబుతాయి ?. అధికారంలో ఉన్నప్పుడు న్యాయవ్యవస్థతో ఆడుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతి విషయంలోనూ తనకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తాయని రాకపోతే ప్రత్యర్థులు మేనేజ్ చేశారని చెప్పడానికి రెడీ అయిపోతున్నారు.
పిల్ల చేష్టల రాజకీయాలు ఆపి సీరియస్ నెట్ పెంచుకోవడం ముఖ్యం !
జగన్ రెడ్డి రాజకీయం అంతా పిల్లలాటలానే ఉంది. ఆయనకు రూల్స్ తెలియవు..తెలిసినా పట్టించుకోరు. ఏదో తాను కోరుకున్నట్లుగా అంతా సాగాలని అనుకుంటున్నారు. ఏ లోకంలో ఉంటారో కానీ.. ఆయనకు రియాలిటీ చెప్పేందుకు సజ్జల లాంటి వాళ్లు కూడా ఎందుకు ప్రయత్నించరో.. ప్రయత్నించి విఫలమవుతారో లేకపోతే., వారు కూడా అదే మైండ్ సెట్ తో ఉంటారో ఎవరికీ అర్థం కాదు. జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం.. కూటమికి చాలా పెద్ద రిలీఫ్. కానీ ప్రజలకుతీవ్ర నష్టం.