ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి తయారైంది. ఇప్పటికప్పుడు వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి వెళ్తే చీదరింపులు తప్పేలా లేవు. అలా కాదని ఆలస్యం చేస్తే పార్టీని ప్రజలు మరిచిపోతారేమోనని ఆందోళన జగన్ ను వేధిస్తోంది. దీంతో పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలన్న విషయంపై జగన్ రెడ్డి పార్టీ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు.
ఇప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తే పార్టీ పట్ల మరింత నెగిటివీటి పెరుగుతుందని కొంతమంది నేతలు జగన్ రెడ్డికి చెప్పి వెళ్తున్నారు. వైసీపీ హాయాంలో అతిగా వ్యవహరించిన నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం ప్రజల్లో కనిపిస్తోంది. జగన్ తో పాటు ఆనేతలు ఎక్కడైనా కనిపిస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల ఇంటిని ముట్టడించిన ఉదంతాలను కూడా జగన్ వద్ద ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితులు కొంత సర్దుకునే వరకు ఓపిక పట్టాలని సీనియర్లు జగన్ కు సూచిస్తున్నారు. దీంతో పార్టీ ఫ్యూచర్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో జగన్ ఏటు తేల్చుకోలేకపోతున్నారు.
జగన్ సైతం డిసెంబర్ నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నా…ఆలస్యం చేస్తే పార్టీ భవిష్యత్ ఏం అవుతుందోనన్న ఆందోళన జగన్ ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు ఇప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళవద్దని జగన్ భావిస్తున్నా..పరిస్థితులు మాత్రం పార్టీని ముంచేస్తాయా..? అని లోలోపల జగన్ మధనపడుతున్నట్టు తెలుస్తోంది.