అప్పులు కావాల్సినన్ని పుట్టకపోతూండటంతో ఏపీ సీఎం జగన్ రెడ్డికి కాళ్లూ చేతులూ ఆడని పరిస్థితి వచ్చేసింది. ఇచ్చిన అప్పుల పరిమితిని వంద రోజుల్లో ఊదేసి.. అదనపు అప్పుల కోసం పరుగులు పెడుతున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టానని… సీపీఎస్ రద్దు చేయుకుండా కొనసాగిస్తున్నాని. కేంద్రం చెప్పిన సంస్కరణలన్నీ అమలు చేస్తున్నానని చెప్పి.. అప్పులు పుట్టించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెర వెనుక కార్పొరేషన్ల రుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ ఎన్ని అప్పులు ఇస్తామని అనుకుంటున్నారో కానీ.. కేంద్రం ఇటీవల కాస్త నట్లు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి విధేయతా ప్రదర్శన చేసి కాస్త అప్పులకు అవకాశం తెచ్చుకోవాలనుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆయన టీం ఢిల్లీలో పడిగాపులు పడుతోంది . జగన్ రెడ్డి కలిసేందుకు అపాయింట్ మెంట్ కావాలని అడుగుతోంది. కానీ ఇంకా సానుకూల ఫలితం రాలేదు. కనీసం అమిత్ షా అపాయింట్ మెంట్ కావాలని ప్రభుత్వం తరపున తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
దేశ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. దీంతో బీజేపీ ఏం చేయబోతోందనన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. అప్పటి వరకూ ఆయనకు అపాయింట మెంట్ దక్కదని చెబుతున్నారు. ఆ తర్వాత ఇస్తారో లేదో కానీ.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వైసీపీ మరింత గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న చర్చ మాత్రం జోరుగా ప్రారంభమయింది.