” కష్టపడి పది రూపాయలు సంపాదించినా ప్రశాంతంగా హాయిగా కూర్చుని తినగలవు కానీ అక్రమంగా వంద రూపాయలు సంపాదిస్తే ప్రశాంతంగా తినలేవు సరి కదా ఆ వందతో వచ్చే సమస్యలతో మానసిక క్షోభతో పడే శిక్షను జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది ” జగన్ రెడ్డి తాను నాలుగు గోడల మధ్య ఆచరిస్తానని, చదువుతానని చెప్పిన బైబిల్లో అయినా ఆయన బయట గౌరవిస్తానని చెప్పిన హిందూ, ముస్లిం, సిక్కు మత గ్రంధాలలో అయినా సారం ఇదే. జగన్ రెడ్డి మిగతా మత గ్రంధాలను పట్టుకోకపోవచ్చు కానీ బైబిల్ మాత్రం రోజూ చదువుతారు. పరుల సొమ్ము పాపము వంటిది అని అయన ఖచ్చితంగా చదువుకుని ఉంటారు. కానీ దేవుడ్ని ఆయన లెక్క చేయలేదు. పరుల సొమ్ము అంటే తనదే అనుకున్నారు. అందకే ఇప్పుడు ఆ సొమ్ము పాములాగా ఆయనను చుట్టుసుంటోంది. ఆయన చేసిన పాపం జీవితాంతం వెంటాడనుంది. ఇప్పటికే ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. అది జీవితాంతం అనుభవించనున్నారు.
తల్లి, చెల్లిపై కోర్టుకెక్కే లీడర్ దేశంలో జగన్ ఒక్కడే !
తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం సిగ్గుపడకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేసేశారు. అందులో ఆయన చెప్పిన కొన్ని అంశం ఏమిటటంటే ఇక తమ మధ్య ప్రేమాబిమానాలు ఏమీ మిగల్లేదని అందుకే తాను ప్రేమాభిమానాలతో రాసిచ్చిన షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నానని. ఈ ప్రేమాభిమానాలకు జగన్ రెడ్డి పెట్టుకున్న కొత ఏమిటో కానీ వాళ్ల అనుబంధాలు, ఆప్యాయతల లెక్క ఏమిటో ప్రజలకు అవసరం లేదు. కానీ అసలు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మాత్రం ప్రజలకు చెప్పాల్సి ఉంది. ఇదంతా ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చి వారి వద్ద నుంచి లంచాలను తన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో తీసుకోవడం వల్ల వచ్చిన ఆస్తులు. జగన్ రెడ్డి సంపాదించానని చెప్పుకుంటున్న భారతి సిమెంట్స్‌లో ఆయన నికరంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. సాక్షి మీడియాలోనూ అంతే. ఆయన పెట్టిందల్లా సండూర్ పవర్ అనే ఓ కంపెనీ. ఆ కంపెనీ నుంచి పావలా కూడా చేయని షేర్లను వేలకు వేలు చేసి అమ్మేసి పెట్టుబడుల రూపంలో లంచాలు దోచేశారు. ప్రజాధనాన్ని అప్పనంగా ఇతరులకు కట్టబెట్టేశారు. ఇలా జరిగిన దోపిడీ వ్యవస్థీకృతంగా సాగింది. చివరికి ప్రకృతికి కూడా ఆగ్రహం వచ్చిందేమో కానీ పరిస్థితుల్ని తారుమారు అయిపోయాయి.
దోచుకున్న ఆస్తుల కోసం కుటుంబం అంతా రోడ్డున పడింది !
వైఎస్ చనిపోయినప్పటి నుండి ఆ కుటుంబంలో ఏం జరుగుతోంది ?. బయట పడే వరకూ లెక్కలేనన్ని పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా సంపాదించినా సరే జగన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు.. బ్రీఫ్ కేసు కంపెనీల్లో ఆస్తులన్నీ నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు చెందాలని వైఎస్ చెప్పారు. దానికి విజయమ్మే సాక్ష్యం అని షర్మిల అంటున్నారు. వైఎస్ ఏమీ ఆస్పత్రి బెడ్ మీద ఉండి చనిపోలేదు కాబట్టి వీలునామా రాయలేరు. రాసినా దాని వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ ఆస్తులన్నీ జగన్ రెడ్డి పేరు మీద కూడా లేవు. బినామీ కంపెనీల పేరు మీద ఉన్నాయి. ఎలా అయినా ఓ పంచాయతీ అయితే వైఎస్ చనిపోయిన వెంటనే జరిగింది అదేమిటంటే సంపాదించిన ఆస్తులు మొత్తం సమానంగా పంచాల్సిందే. ఈ క్రమంలో షర్మిల వెంటపడితే నాన్చి నాన్చి.. ఎన్నికల ప్రచారం చేయరేమో అన్న అనుమానంతో కొన్ని ఆస్తులు రాసి ఎంవోయూ చేశారు. ఇప్పుడు అది కూడా రద్దు చేస్తానని ఎన్సీఎల్టీకి వెళ్లారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. తన భార్యతో పాటు అవినాష్ రెడ్డిపై విమర్శలు చేయకూడదని కానీ అలా చేస్తున్నారని చెప్పి షేర్లు వెనక్కి తీసుకుంటానంటున్నారు. ఇప్పుడు ఇది ప్రతి తెలుగు వాడి ఇంట్లో చర్చకు వస్తోంది. దేశంలో రాజకీయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో చర్చజరుగుతోంది. ఏమని జరుగుతుందో కూడా జగన్‌కు తెలిసే ఉంటుంది. తెలియనట్లుగా నటిస్తే ఎవరికీ నష్టం లేదు కానీ .. ” అడ్డగోలుగా సంపాదించిన అక్రమాస్తుల కోసమే కుటుంబం రోడ్డున పడిందని ” అందరూ చర్చించుకుంటున్నారు. ఇందులో శతశాతం నిజం ఉంది. ాను ఫలానా వ్యాపారం చేసి సంపాదించానని జగన్ రెడ్డి కూడా చెప్పలేరు.
రాబోయే రోజుల్లో మరింత ఘోరమైన శిక్ష ఖాయం
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ జగన్ రెడ్డికి దేవుడు విధిస్తున్న శిక్షనే. అక్రమ సంపాదన నిలుపుకోవడం ఆయన పదహారు నెలులు జైల్లో ఉన్నారు. అంతేనా భవిష్యత్లోఇంకెన్ని నెలలు జైలుకు వెళ్లాలో ఇప్పుడే ఊహించలేరు.కానీ ఆ సంపద కోసం కుటుంబం చీలిపోయింది. చివరికి తల్లి, చెల్లిపై కూడా కోర్టుకెళ్లేంత దౌర్భాగ్య మానసిక స్థితికి వచ్చేశారు. అంత చీప్ మెంటాలిటీ ఉన్న ఆయన ప్రజల్ని ఎలా పరిపాలించి ఉంటారో చెప్పాల్సిన పని లేదు. పది రూపాయలు బటన్ నొక్కి అదేదో తన సొమ్ము ఇస్తున్నట్లగా ప్రజల్ని బానిసలుగా చూశారు. అందుకే పాతాళంలోకి నెట్టేశారు ప్రజలు. ఇప్పుడు కుటుంబం పరమైన గొడవలతో ఆయనకు అసలు శిక్ష ప్రారంభమయింది. ఇప్పటిదాకా గుట్టుగా ఉన్న ఇంటి గొడవ రచ్చకెక్కింది. దీనికి కారణం జగన్ రెడ్డే. అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉంటాయి కానీ ఎవరైనా తల్లి, చెల్లిపై కోర్టుకెళ్తారా అని షర్మిల ప్రశ్నింాచరు. అలా కోర్టుకెళ్లి కుటుంబాన్ని రోడ్డున పడేసింది జగన్ రెడ్డే. ఇంత దాకా వచ్చిన తర్వాత ఆమె షర్మిల అయినా.. విజయమ్మ అయినా ఎందుకు జగన్ పట్ల ప్రేమాభిమానాలు చూపాలి ?. తనకే మాత్రం ప్రేమాభిమానాలు లేవంటున్న జగన్ రెడ్డి పట్ల ఎందుకు వారు ఆప్యాయంగా ఉండాలి ?. వారు చేయబోయే చర్యలతో జగన్ రెడ్డి మరింత టార్చర్ అనుభవించబోతున్నారు. కుటుంబపరంగా ఆయన ఇప్పుడు ఒంటరి. హత్య కేసులో అడ్డగోలుగా ఇరుక్కున్న అవినాష్ రెడ్డి కూడా రేపోమాపో జగన్ తో ఉంటే తాను జైలుకు పోతానన్న భయంతో సర్దుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ భయం జగన్ రెడ్డే వ్యక్తం చేశారని వైఎస్ సునీత చెప్పారు. అంటే ఇప్పుడు జగన్ రెడ్డికి తల్లి లేదు.. చెల్లి లేదు.. బంధువులు లేరు ఒంటరి అయ్యార. చివరికి ఆయన నుంచి ఏదైనా ప్రయోజనం ఉంటందని అనుుకుంటేనే ఎవరైనా వస్తారు.. ఎదుకంటే జగన్ రెడ్డి అదే మైండ్ సెట్‌తో ఉన్నారు కాబట్టి.
ఎన్నో కుటుంబాలను చీల్చి ఇబ్బంది పెట్టిన పాపం వెంటాడుతుంది !
అవినీతి చేసి అక్రమ సంపాదన చేసినందుకు మాత్రమే దేవుడు ఈ శిక్ష విధించడం లేదు. ఆ అక్రమ సంపాదనతో ఇతర కుటుంబాలను చీల్చేందుకు.. వారిని వేధించేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా ఈ శిక్ష అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డి అ కారణంగా .. కేవలం రాజకీయంగా ఉన్న కోపంతో ఎన్ని కుటుంబాల్ని వేధించారు ?. చంద్రబాబు నాయుడు సోదరుడు అనారోగ్యంతో ఉంటే ఆయన పేరుతో తప్పుడు ప్రచారాలు చేశారు. రామోజీరావు కుమారుడు బోన్ క్యాన్సర్ తో బాధపడుతూంటే ఆయనను అడ్డం పెట్టుకుని మానసికంగా వేధించారు. చంద్రబాబు, రామోజీరావు కాదు ఆయన వేధించని రాజకీయ ప్రత్యర్థుల కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. అలా చేసినందుకే ఇప్పుడు జగన్ రెడ్డికి ఆ మానసిక వేదన ఎలా ఉటుందో చూపించేలా శిక్ష విధిస్తున్నాడు. నిరంతరం బైబిల్ చదివే జగన్ రెడ్డికి ఈ విషయంలో స్పష్టత లేకపోతే.. బల్బ్ వెలగకపోతే ఆ తప్పు ఆయనది కాదు. కనీసం పశ్చాత్తాపం ఉండదని ఆయన మనస్థత్వానిదే అనుకోవచ్చు.
ఇది దేవుడు విధించిన యావజ్జీవ శిక్ష.. తప్పించుకోవడం అసాధ్యం !
జగన్ రెడ్డిని దేవుడు శిక్ష విధిస్తే ఆయనకు ముఖ్యమంత్రిగా పదవి ఎలా వచ్చిందని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఆయన పదవిని అనుభవించారా లేకపోతే తన మానసిక రుగ్మతల కారణంగా మరిన్ని సమస్యలను కొని తెచ్చుకున్నారా అన్నది సులువుగా అర్థం అవుతుంది. ఇప్పుడు జగన్ రెడ్డి పడుతున్న ప్రతి కష్టానికి, సమస్యకు కారణం ఐదేళ్ల పాటు అధికారం చేతికి అందడమే. అధికారం అందగానే కళ్లు నెత్తికెక్కి తానో దైవాంస సంభూతుడ్ని అనుకునే పరిస్థితి కల్పించి ఆయనను పై నుంచి పాతాళంలోకి పడేశాడు దేవుడు. అంత కంటే పెద్ద శిక్ష ఏముంటుంది ?. ఇప్పుడు కుటుంబపరమైన వివాదాలతో ఆయన జీవితాంతం కలిగిపోవాల్సిందే. మరో సారి ఏ కుటుంబసభ్యుడూ ఆయనను నమ్మరు. తన రాజకీయానికి పనికి వస్తారని అనుకున్న మృతదేహాలు దొరికిన ఇంటికి వెళ్లి ఆయన నా తమ్ముడు.. నా చెల్లి అని చెప్పుకోవాల్సిందే. బొత్స లాంటి వాళ్లను నా పితృ సమానుడు అని ప్రకటించుకోవాలి. ఇప్పుడు తల్లి విజయమ్మ కూడా దూరమయ్యారు కాబట్టి లక్ష్మిపార్వతినో మరో మహిళా నేతనో మాతృసమానులుగా చెప్పుకుని సంతృప్తి పడాలి. జగన్ రెడ్డికి దేవుడు విధిస్తున్న శిక్ష ఇప్పుడే ప్రారంభమయింది. ఇది యావజ్జీవితం ఉంటుంది. దీన్నుంచి ఆయన తప్పించుకోలేరు. ఎందుకంటే మారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చిన అన్ని అవకాశాలను కాలదననుకున్నాడు మరి. అనుభవించాల్సిందే !