అదానీతో డీల్ వ్యవహారంలో జగన్ రెడ్డి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. దోపిడీకి అలవాటు పడిన జగన్ రెడ్డి తన అధికారం శాశ్వతమని అనుకున్నారు. అందుకే అడ్డగోలుగా చేసిన అవినీతిని పద్దతిగా కూడా చేయలేదు. ఆయన లంచాలుగా తీసుకున్న రూ.1750 కోట్లు ఎలా తరలించారో కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుకుంటే ఒక్క రోజులో తేలుస్తాయి. కానీ అప్పుడు అదానీ లంచాలు ఇచ్చినట్లుగా ఒప్పుకోవాల్సి వస్తుంది. అది ఆయన లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను ముంచేస్తుంది. అందుకే ఈ విషయంలో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ కేసులో జగన్ రెడ్డి చుట్టూ వల వేయడానికి ఆయనను బయటకు రాకుండా చేయడానికి ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందం చేసుకోవడం. నిజంగానే కేబినెట్ అనుమతి తీసుకోలేదు. కేవలం రూ. 2.49 పైసలకు యూనిట్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ అసలు చెల్లించేది ఐదు రూపాయలపైనే . ఇక్కడే మతలబు ఉంది. నేరుగా జగన్ రెడ్డి మాత్రమే ఈ డీల్స్ చేశారని..తనకేం సంబంధం లేదని అప్పటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారని పీవీ రమేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రకటించారు.
ఇదేమీ చిన్న విషయం కాదని గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేసి జగన్ ను ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లిక్కర్ సహా అనేక కేసుల్లో నేరుగా జగన్ రెడ్డి చేసిన అవినీతి గురించి ఆరా తీశారు. ఆ వివరాలతో కేసులు పెట్టడానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్ రెడ్డికి మరో ఆరు నెలల్లోనే హారర్ సినిమా ఉంటుందని .. చేసిన ప్రతి తప్పునకు శిక్ష ఉంటుందని గట్టి సూచనలు కనిపిస్తున్నాయి.