ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ కేబుల్ కనెక్షన్లలో రాకుండా చేశారు. దీంతో అసలైన నిజమైన సమాచారం కోసం ఎక్కువ మంది యూట్యూబ్ లో ఏబీఎన్ చానల్ ను పెట్టుకుని చూస్తున్నారు. ఈ కారణంగా ఆ చానల్ జాతీయ స్థాయిలో పాపులర్ అవుతోంది.
ఫోన్లలో యూట్యూబ్ లో ఇండియాలో న్యూస్ చానల్స్ రేటింగ్స్ లో ఏబీఎన్ నాలుగో స్థానానికి చేరుకుంది. జీ న్యూస్, అజ్ తక్, టీవీ9 మరాఠీ తర్వాత ఏబీఎన్ చానలే. గతంలో ఇరవై స్థానాల తర్వాత ఎక్కడో ఉండేది. కానీ వివేకా కేసు పరిణామాలు, ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలకు తెలియకుండా కట్టడం చేయడంతో.. చాలా విషయాలు తమకు తెలియడంలేదని ప్రజలు ఫీలవుతున్నారు. అందుకే ఎక్కువగా ఏబీఎన్ చానల్ కు మైగ్రేట్ అవుతున్నారు. అందుకే యూట్యూబ్ లో ఆ చానల్ దూసుకెళ్తోంది.
ఏపీలో ఏబీఎన్ ను బ్యాన్ చేయడం వల్ల జగన్ సాధించిదేమీ లేదు. ఆ విషయం కూడా ఆయనకు తెలుసు. అందుకే అదే పనిగా… బహిరంగసభల్లో ఏబీఎన్ పై పడి ఏడుస్తూ ఉంటారు. చానల్ రాకుండా చేసి.. ఆయన అలాచెప్పడం వల్ల… ఆయన కూడా అదే చానల్ చూస్తారేమో అన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. కారణం ఏదైనా … నాశనం చేయాలనుకున్నవారిని సంస్థలను జగన్ .. తన విపరీత చేష్టలతో మరితం బలోపేతం చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.