వివేకా హత్య కేసులో చట్టబద్ధంగా రికార్డెడ్ స్టేట్మెంట్ ఇచ్చి.. ఇప్పుడు సీబీఐపై నిందలు వేస్తూ..కోర్టులో పిటిషన్ వేసిన కల్లం అజేయరెడ్డికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వాంగ్మూలం ఆడియో టేపుల్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. సీనియర్ ఐఏఎస్, సీఎస్‌గా చేసిన వ్యక్తి ఇలా చేయడం అంటే.. ఆయనను ఖచ్చితంగా బయట వ్యక్తులు ప్రభావితం చేశారని సీబీఐ చెబుతోంది. ఎవరు ప్రభావితం చేశారో.. చేస్తున్నార తెలుసుకోవడం సీబీఐకి పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఆ ప్రభావితం చేసే వ్యక్తులపై ఏం చర్యలు తీసుకోబోతున్నారన్నది.. కల్లాం పిటిషన్‌పై కోర్టు తీర్పు తర్వాత తేలనుంది.
జగన్ రెడ్డి షరుతలతో కూడిన బెయిల్ పై ఉన్న నిందితుడు. సాక్షులను ప్రభావితం చేయకూడదన్నది ఆయన బెయిల్ రూల్స్ లో మొదటి నిబంధన. ఇది ఆయన కేసుల్లోనే కాదు.. ఏ కేసుకైనా వర్తిస్తుంది. అత్యంత ఘోరమైన వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల్ని తన అధికారాన్ని ఉపయోగించి ప్రభావితం చేయడం చిన్న విషయం కాదు. కల్లాం అజేయరెడ్డి .. సీబీఐకి తన స్టేట్మెంట్ విషయంలో ఎన్ని సార్లు మాట మార్చారో కళ్ల ముందే ఉంది. చివరికి అసలు స్టేట్ మెంట్ తప్పు రాశారని సీబీఐ మీదే ఆరోపిస్తున్నారు. దీన్ని దర్యాప్తు సంస్థ తేలికగా తీసుకునే అవకాశం ఉండదు.
సీబీఐ వివేకా కేసు విషంయలో సీరియస్ గా తీసుకుని ఉంటే.. కల్లం అజేయరెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు తర్వాత.. ప్రభావితం చేసిన వ్యక్తులపై చర్యలు ఉపక్రమించే అవకాశం ఉంది. లేకపోతే సీబీఐ సాక్షులను ప్రభావితం చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఇక్కడ అజేయరెడ్డిని ప్రభావితం చేసిన శక్తి జగన్ రెడ్డేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఆయన బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేస్తారా ?