అసలు 9 కుట్లు పడే అంత గాయం అయిందా..? లేదా..?
అసలు జగన్మోహన్ రెడ్డికి గాయం అయిందా లేదా అన్నది పెద్ద పజిల్.. నిజంగా గాయం అయితే… విశాఖ ఎయిర్ పోర్టు అధికారులు ఊరుకోరు. ఎందుకంటే.. తమ పరిధిలో అలాంటి ఘటనల జరిగితే బాధితుల్ని అలా వదిలి పెట్టరు. అక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటారు. కచ్చితంగా ప్రాథమిక చికిత్స చేస్తారు. పేషంట్ కు ఇష్టం లేకపోయినా చేస్తారు. అది వారి బాధ్యత. గాయం అయితే.. దాన్ని చూపించి సానుభూతి పెంచుకోవడానికి జగన్ మీడియా చేయాల్సిందందా చేస్తుంది. కానీ గాయం ఫోటో అసలు బయటకు రాలేదు ఎందుకు..? హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ప్లాస్టర్ వేసిన ఫోటోను రిలీజ్ చేశారు కానీ.. గాయం ఫోటోను ఎందుకు విడుదల చేయలేదు..!
వైద్యం తీసుకోకుండా ఎందుకు వెళ్లిపోయారు..? జగన్
ఎయిర్ పోర్టులో… ప్రాథమిక చికిత్స తీసుకున్నారా లేదా..?. ప్రాథమిక చికిత్స కూడా అవసరం లేదని.. ఎందుకు.. ఊరుకున్నారు…?. ఘటన జరిగిన మూడు, నాలుగు గంటల తర్వాత… సహజసిద్ధంగా అభివాదాలు చేస్తూ… ఆశీర్వదం ఇస్తూ.. అటు వైజాగ్ ఎయిర్ పోర్టులోనూ.. ఇటు హైదరాబాద్ ఎయిర్ పోర్టులోనూ.. చివరికి ఆస్పత్రిలోకి వెళ్లేటప్పుడు కనిపించిన జగన్… ఆ తర్వాత తొమ్మిది కుట్లు పడేంత గాయం అయిందని ప్రచారం చేసుకోడం.. నమ్మశక్యమేనా..? జగన్ తనకు తగినట్లు చెబుతున్న గాయానికి చిన్న కట్టు కూడా కట్టుకోకుండా.. ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయారు…?
మెడికో లీగల్ కేసు అయితే ప్రయాణానికి ఎలా అనుమతిచ్చారు ?
జగన్ పై జరిగినట్లు చెబుతున్న దాడి వ్యవహారంలో.. అసలు జగన్ కు గాయం అయిందా లేదా అన్న అనుమానం రావడానికి మరో కారణం విమాన ప్రయాణం. విమానాల్లో ప్రయాణానికి చాలా స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. ప్రతి చిన్న అంశాన్ని ప్రయాణికుల భద్రతా కోణంలో చూస్తారు. ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనలో గాయపడినట్లు చెప్పుకున్న జగన్ … చొక్కా రక్తపు మరకతో ఉంది. నిందితుడ్ని పట్టుకున్నారు. అలాంటప్పుడు.. అది మెడికోలీగల్ కేసు. ఉన్న పళంగా ఆయనను.. ఆస్పత్రికి పంపాలి. కానీ.. ఆ ఘటన జరిగిన తర్వాత గంట సేపు.. విమానాశ్రయంలో ఉండి తీరిగ్గా.. విమానాన్ని పట్టుకుని హైదరాబాద్ వెళ్లారు. ఎయిర్ పోర్టు అధికారులెవరూ… అభ్యంతరం చెప్పలేదు. రక్తం కారుతూంటే.. మెడికో లీగల్ కేసు అయితే..ఎందుకు అభ్యంతరపెట్టలేదు..?
భద్రత బాధ్యత ఎవరిది..? ఎవర్ని నిందిస్తున్నారు?
ఎయిర్ పోర్టు గేటు లోపలకి వెళ్తే.. ఆ ప్రాంతం మొత్తం… సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. విశాఖ విమానాశ్రయం నేవీ పరిధిలో ఉంటుంది. భద్రత మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది. విమానాశ్రయం గేటు బయట ఏమైనా జరిగితే… బాధ్యత వహించాల్సింది ఏపీ ప్రభుత్వమే. కానీ విమాశ్రయంలో జరిగింది. అయినప్పటికీ… అటు బీజేపీ నేతలు.. ఇటు వైసీపీ నేతలు కూడబలుక్కుకున్నట్లుగా.. ఎందుకు ఏపీ ప్రభుత్వంపై దాడి చేస్తారు. విమానాశ్రయంలో జరిగిన దానికి ఏపీ ప్రభుత్వానికి ఒక్క శాతం కూడా బాధ్యత లేదు. అలాగే దాడి చేసిన వ్యక్తీ.. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అలాంటప్పుడు టార్గెట్ పెట్టుకున్నట్లుగా టీడీపీ అధినేత ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ..?