స్టార్ హోటల్లో ప్రెస్ మీట్ .. తెలుగు జర్నలిస్టులకు మాత్రం ఆహ్వానాల్లేవు. ఇతర హిందీ, ఇంగ్లిష్ పత్రికల జర్నలిస్టులను పిలిచారు. మంచి మర్యాదలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడూ చెప్పే సోది చెప్పారు. తీరా జర్నలిస్టులు ప్రశ్నలు అడగడం ప్రారంభించేసిరికి… తెల్ల మొహాలు వేసుకున్నారు.
అసలు వారు చెప్పే విషయాల్లో తప్పు ఎక్కడ ఉందో.. ఎవరికీ తెలియలేదు. తప్పు ఎక్కడ జరిగిందో జర్నలిస్టులు చెప్పమంటే చెప్పలేకపోయారు. చంద్రబాబు తప్పు చేసినట్లుగా ఎక్కడ ఉందో చూపించమంటే.. పీవీ రమేష్ రాసిన నోట్ ఫైల్ ఒకటి చూపించారు. అందులో అంత నేరం ఉంటే.. మరి డబ్బులు విడుదల చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు.. ఆ నోట్ ఫైల్ వెళ్లేది వాళ్లదగ్గరకే కదా అంటే… సంతకం పెట్టిన వాళ్లని అరెస్ట్ చేసేస్తామా అని సంజయ్ ఎదురు ప్రశ్నించారు. ఈ సమాధానం విని ఢిల్లీ జర్నలిస్టులకు మైండ్ బ్లాంక్ అయింది. అసలు నేరుగా అప్పటి ముఖ్యమంత్రికి ఎలా సంబంధం అంటే.. అధికారులపై ఒత్తిడి తెచ్చారని చెబుతూంటారు. అలా ఒత్తిడి తెస్తే డబ్బులు విడుదల చేయడం కూడా నేరమే కదా … అంటే వారి దగ్గర సౌండ్ లేదు.
పోనీ ఇంత దుర్వినియోగం జరిగిందంటున్నారు.. మనీ ఎవరెవరికి చేరిందో చెప్పగలరా అంటే… అదీ లేదు. చంద్రబాబే ప్రధాన లబ్దిదారుడు అంటున్నారు కదా.. అంటే మాకు ఆధారాలు దొరికాక మీకు ఇస్తాం అని చెప్పుకొచ్చారు. అసలు ఢిల్లీ జర్నలిస్టులు అడిగిన ఒక్క ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ప్రశ్నలు శరపరంపరగా వస్తూండటంతో… ఇంటరాగేషన్ లాగా ఫీలైపోయి వెళ్లిపోయారు. అసలు కేసు కోర్టులో ఉండగా.. ఊరూరా తిరిగి ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే… బట్లర్ ఇంగ్లిష్లో … పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పిన ఆన్సర్ వినీ…. జర్నలిస్టులు నవ్వాపుకోలేకపోయారు.
చంద్రబాబు ఏదో అవినీతి చేశాడని చెప్పేందుకు పనికి మాలిన డాక్యుమెంట్లు చూపిస్తూ… అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ. జంట కవుల్లా వీరిద్దరూ ఊరూవాడా తిరుగుతున్నారు. గతంలో మార్గదర్శి కేసులోనూ.. ఇంతే తిరిగాడు సీఐడీ చీఫ్ సంజయ్. ఇప్పుడు చంద్రబాబు కేసులో. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా… ముఖ్యమంత్రి చెప్పినట్లుగా చేస్తున్నారా అన్నది ఢిల్లీ జర్నలిస్టులకూ క్లారిటీ వచ్చింది. మొత్తంగా ఏపీలో వ్యవస్థల పనితీరును ఢిల్లీ మీడియా ముందు పెట్టారు… పొన్నవోలు రెడ్డి.. సీఐడీ సంజయ్ !