సీఎం జగన్మోహన్ రెడ్డి .. తనకు రెడ్లు మాత్రమే ఓట్లేశారని ఎందుకు అనుకుంటున్నారో కానీ.. ఎక్కడైనా వారికి తప్ప ఇంకెవరికీ ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రస్తుతం పోలీస్ శాఖలో చేసిన బదిలీలు.. కీలక నియామకాల విషయం హాట్ టాపిక్‌గా మారింది. డీజీపీ దగ్గర నుంచి ప్రతీ స్థాయిలో లా అండ్ ఆర్డర్ మొత్తం ఒకే వర్గంతో నిండిపోయింది. ప్రతిభ, నిజాయితీ, సిన్సియారిటీ ఉన్న ఇతర అధికారులు పక్కకు వెళ్లిపోయారు. వారికి అప్రాధాన్య పోస్టులే ఎక్కువన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. ఒక్క పోలీసు శాఖనే కాదు.. అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి ఉంది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వినిపించి.. కనిపించే అధికారి పేరు రెడ్డి. నామినేటెడ్ పోస్టుల్లోనూ వారే్.
వచ్చిన యాభై శాతం ఓట్లన్నీ రెడ్లవేనా ? ఇతర వర్గాలూ ఓట్లేయలేదా ?
ఏపీలో రెడ్ల ఓట్ల శాతం .. ఆరేడు శాతం వరకూ ఉంటుంది. కానీ పోస్టుల్లో మాత్రం సగానికిపైగా ప్రాధాన్యత లభిస్తోంది. జగన్‌కు వచ్చిన ఓట్లు శాతం యాభై. అంటే.. ఒక్క రెడ్లు ఆరేడు శాతంలో వంద శాతం ఆయనకు ఓట్లు వేశారనుకున్నా.. మిగతా 43 శాతం వర్గీయులు ఇతర సామాజికవర్గాలకు చెందినవారే. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ .. ఇతర అగ్రకులాల్లో ఆయనకు చాలా వరకూ సపోర్ట్ చేయబట్టే అంత విజయం లభించింది. కానీ వారినెవర్నీ జగన్ నమ్మలేకపోతున్నారు. ఎవరికీ పోస్టులు ఇచ్చేందుకు కానీ పక్కన పెట్టుకునేందుకు కానీ ప్రాధాన్యత ఇచ్చేందుకు కానీ ఆయన మనసు అంగీకరించడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు వివాదాస్పద పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పాలన.. పోలీసు .. మొత్తం ఎక్కడ చూసినా రెడ్డి అధికారులదే రాజ్యం ! ఇతర వర్గాల్లో సామర్థ్యం లేదా ?
ఏపీలో రెడ్డి సామాజికవర్గం ఉద్యోగాల్లో ఉండేది తక్కువే. ఎక్కువగా వ్యాపార వ్యవహారాల్లో ఉంటారు. అలా ఉద్యోగుల్లో ఉండే అతి తక్కువ రెడ్డి సామాజికవర్గంలోని వారికి ఏరికోరి ప్రధాన పదవులు ఇస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని.. ఇతర శాఖల్లో ఉన్న వారిని తీసుకు వచ్చి.. టీటీడీ ఈవో లాంటి కీలకమైన పదవులు ఇచ్చారు కానీ.. రాష్ట్రానికి సంబంధించి.. ఇతర వర్గాలకు కనీస ప్రాధాన్యం ఇవ్వడానికి సీఎం జగన్ మనసు అంగీకరించడం లేదు. వారంతా పరాయి వారేనని డిసైడయి పోయారు.
సామాన్య రెడ్డి ప్రజానీకానికీ సమస్యలు – అందరితో పాటు వారికీ సమస్యలు !
సీఎం జగన్ తన మనసును విశాలం చేసుకోలేకపోతున్నారు. తనకు ఓట్లేసిన వర్గానూ నమ్మలేకపోతున్నారు. ఓ కులంపై ఆయన నేరుగానే వ్యతిరేకత చూపిస్తూంటారు. మరికొన్ని కులాలపై.. మాటల్లోనే విరుపు చూపిస్తూంటారు. చేతల్లో మాత్రం అన్ని కులాలపై వ్యతిరేకత చూపిస్తున్నారు. అధికార విధుల్లో ఉండేవారికే ఆ ప్రాధాన్యం లభిస్తోంది. నిజానికి సీఎం జగన్ తీరు వల్ల లాభపడుతోంది.. పదవుల్లో ఉన్న రెడ్లే తప్ప సామాన్యులు కాదు. సామాన్యులైన రెడ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ జగన్ మాత్రం… అవేమీ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తికి వారూ గురవుతున్నారు.