సీఎం జగన్ ఆగస్టు నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది ముఖ్య నేతల్ని పిలిపించి ఈ సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వరని.. ఇప్పటి వరకూ ఆయనను ప్రత్యక్షంగా ఒక్క సారి కూడా కలవని ఎమ్మెల్యేలు వంద మందికిపైగానే ఉంటారని… ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడితారని ఎలా నమ్మాలని వైసీపీ నేతలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయి.
ప్రతీ రోజూ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష పెట్టినా ఆరు నెలల పాటు నిర్విరామంగా నిర్వహించాల్సి ఉంటుంది. అది సాధ్యమా అంటే… ఎవరికైనా కాదనే అనిపిస్తుంది. ఓ వైపు పార్టీ నేతల్ని గడప గడపకూ అని ఒత్తిడి తెస్తూ.. మరో వైపు ఈ సమీక్షలు పెడితే.. ఆ కార్యక్రమంపై సీరియస్‌నెస్ తగ్గిపోతుంది. మధ్యలో అధికారిక పనులు చాలా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే… నియోజకవర్గాల సమీక్షలు అనేది జగన్ ప్రారంభించగలరు కానీ పూర్తి చేయలేరని అనుకోవచ్చు.,
నియోజకవర్గాల సంగతేమోకానీ కనీసం తమకు అయినా అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎక్కువ మంది వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయని.. తమ సమస్యలు వినాలని వారు అనుకుంటున్నారు., అయితే సమస్యలు వింటే పరిష్కారం చూపించాలి.. అది చూపించాలంటే నిధులు కావాలి.. ఎలా అనేది ఇప్పుడు సీఎం ముందున్న ప్రశ్న. అందుకే కలవడం లేదని చెబుతున్నారు.కలుస్తా.. కలుస్తా అని లీకులివ్వడం ఇదే మొదటి సారి కాదు అధికారం చేపట్టి నప్పటి నుండి అంతే ఉంది.
ప్రతి నియోజకవర్గంలో వందలమంది పార్టీ నేతలు ప్రభుత్వంపై నమ్మకంతో పనులుచేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి బిల్లులు చెల్లించకపోతే వారితో భేటీ అయ్యేందుక జగన్ ఆసక్తి చూపించకపోవచ్చు. చెల్లించడానికి నిధుల సమస్య. ఎలాంటి బిల్లులు పెడింగ్‌లో లేని కార్యకర్తల్ని పిలిస్తే.. ఇతర ముఖ్యనేతలకు కోపం వస్తుంది. తాము ఆర్థికంగా చితికిపోయేలా చేసి ఇతర నేతల్ని ప్రోత్సాహిస్తున్నారని నేతలు అనుమానపడతారు. ఎలా చూసినా జగన్‌కు పార్టీ కార్యక్తలతో భేటీలు మీద సామే అనుకోవచ్చు.