బీజేపీ ఈవీఎంలతోనే ఎన్నికల్లో గెలిచిందని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హర్యానాలో ఎన్నికలు ఏపీలోలాగే ఆశ్చర్యకరంగా ఉన్నాయట. అందుకే ఇక్కడ ఈవీఎంలు..అక్కడ కూడా ఈవీఎంలే ఫలితాన్ని మార్చేశాయని అంటున్నారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి తన చేసిన ట్వీట్‌కు .. దేశంలో ఉన్న ప్రముఖులందరికీ ట్వీట్ చేస్తున్నారు. అలాగే తాజా ట్వీట్ ను కూడా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ట్వీట్ చేశారు.
హర్యానాలో సర్వేలన్నీ అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ గెలిచేస్తామని అనుకుంది. కానీ ఫలితాలు తేడాగా వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అదే జమ్మూ కశ్మీర్లో గెలిచామన్న సంగతిని మాత్రం మర్చిపోతున్నారు. కాంగ్రెస్‌కు నైతిక మద్దతు ఇవ్వడనికి ఇండీ కూటమి పార్టీలు కూడా మందుకు రావడం లేదు. చివరికి అసదుద్దీన్ ఓవైసీ కూడా .. కాంగ్రెస్ ఈవీఎంలపై నిందలు వేయడం మానేసి లోపాలు సరి చేసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి తానున్నానని తెరపైకి వచ్చేశారు.
బీజేపీపై జగన్ నేరుగా ఎటాక్ చేస్తున్నారని అనుకోవచ్చు. కాంగ్రెస్‌తో కలిసి బీజేపీపై ఈవీఎంల విషయంలో పోరాడేందుకు ఆయన రెడీ అవుతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలవడానికి ఈవీఎంలే బ్రిడ్జిగా మారుతాయని భావిస్తున్నారు. అయితే జగన్ రెడ్డి తన ఓటమికి ఈవీఎంలను ఎలా నిందిస్తారని ఆయనకు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు గొప్పవైతే ఇప్పుడు ఎందుకు చెడ్డవవుతాయన్న విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. బ్యాలెట్లతో పోలింగ్ జరిగిన మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో కూడా మెజార్టీ తెచ్చుకోలేకపోయిన ఆయన .. తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పడాన్ని ఎవరూ విశ్వసించడం లేదు. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ కోసం తెర ముందుకు వచ్చేశారు.