ఏపీలో శాంతి భద్రతల విషయంలో ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. వైసీపీ తమ హయాంలో శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నాయని చెబుతుండగా..గత ఐదేళ్లలో శాంతి భద్రతలు ఎంత వైఫల్యం చెందాయో శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు సవివరంగా వివరించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అసెంబ్లీ సాక్షిగా కళ్ళకు కట్టారు.
ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రజల విశ్వసనీయత కోల్పోయిన జగన్… విశ్వసనీయత పొందే మార్గాలు కళ్ల ముందు కనిపిస్తున్నా వాటన్నింటినీ వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. గురువారం అసెంబ్లీలో చంద్రబాబు శాంతి భద్రతల పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తారని తెలుసు..ఇది జగన్ కు మంచి అవకాశం కూడా. ఢిల్లీలో చెప్పిందే అసెంబ్లీకి హాజరై..శ్వేతపత్రం విడుదల సమయంలోనూ చెప్తే జగన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడి ఉండేది. ఆయన వాయిస్ ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్లేది.
Also Read : తప్పడం లేదా..జగన్ కు పెద్దిరెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా?
కానీ, జగన్ మాత్రం అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. తను చెప్పిందే నిజమని నమ్మించేందుకు అసెంబ్లీ సమావేశాల ద్వారా అవకాశం ఉన్నా కాలదన్నుకున్నారు. బహుశా…జగన్ ఢిల్లీలో చెప్పిందంతా అబద్దమే అని జగన్ కూడా భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే అసెంబ్లీకి గైర్హాజరు అయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
పైగా చంద్రబాబు శ్వేత పత్రం ద్వారా వైసీపీ హయాంలో శాంతి భద్రతలు వైఫల్యం ప్రజలకు వివరించిన సమయంలో.. తాను సభలో ఉంటే అది మరింత డ్యామేజ్ చేస్తుంది అన్న ఆలోచనతోనే జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఉంటారన్న టాక్ నడుస్తోంది. మొత్తంగా జగన్ అయోమయంలో ఉన్నారని, అందుకే అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు.