పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించి జగన్ ఆయనను సమర్థించిన వైనం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ది చెప్పినా తాము మారేది లేదని.. పిన్నెల్లి కరెక్టే చేశాడని అడ్డగోలుగా వాదించేశారు. ఇప్పుడు జగన్ తన నెక్ట్స్ ఓదార్చు యాత్రను కర్నూలు జైలుకు పెట్టుకోవాల్సి ఉంది. తన హయాంలో కోడుమూరు ఎమ్మెల్యేగా పెత్తనం వెలగబెట్టిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇప్పుడు అదే జైల్లో ఉన్నారు మరి.
తన ఇంట్లో పని చేస్తున్న పని పిల్లపై ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుధాకర్ అత్యాచార యత్నం చేశాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. వచ్చినప్పుడు జగనే సీఎం. ఆయన వందిమాగధులే పోలీసు అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ భాషలో చెప్పాలంటే సుధాకర్ కూడా పెద్ద తప్పేం చేయలేదని అనుకుని ఉండాలి. కానీ ఇప్పుడా పాప బయటకు వచ్చి పోలీసు కేసు పెట్టింది. ఆ పిల్లకు పన్నెండేళ్లు కన్నా తక్కువే ఉండటంతో పోలీసులు కఠినమైన పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. జగన్ రెడ్డి నెల్లూరు జైలు ముందు మాట్లాడుతున్న సమయంలోనే ఇది జరిగింది.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈవీఎంలను ధ్వంసం చేసిన పార్టీ నేతను అడ్డగోలుగా సమర్థించిన జగన్ రెడ్డి.. పోక్సో కేసులో అరెస్టు అయిన సుధాకర్ ను కూడా అదే విధంగా సమర్థించాలి. లేకపోతే ఆయన రెడ్లకు ఓ న్యాయం .. దళితులకు మరో న్యాయం చూపిస్తారని అనుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్ రెడ్డి పార్టీలో అందరూ అలాంటి వాళ్లే. అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటి వారికే అవకాశాలు కల్పించడంతో ఇప్పుడీ దుస్థితి వచ్చింది. ఆయినా ఆయన మారడం లేదు.