సాక్షి పత్రిక చేస్తున్న ఫేక్ ప్రచారాలతో ఆ పత్రిక మాదే అని చెప్పుకునేందుకు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు . రోజూ లెక్కలు అడిగే భారతి రెడ్డి… ఎడిటోరియల్ ఆదేశాలు ఇచ్చి సజ్జల రెడ్డి .. ఆ పత్రికకు అసలైన యజమాని జగన్ రెడ్డి కూడా … మాది కాదు.. మాకేం తెలియదు అంటున్నారు. ఆ పత్రికని యజమానులు కూడా ధైర్యంగా మాది అని చెప్పుకోలేని దౌర్భాగ్యంగా నడుపుతున్నారు.
ప్రస్తుత మంత్రి నారాయణపై రాసిన అడ్డగోలు కథలతో ఆయన గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఆ కేసు కారణంగానే ఆయనకు పాస్ పోర్టు ఆగిపోయింది. కోర్టుకెళ్లి పూచికత్తు కోరడానికి నామోషీ ఫీలయి అసలు లండన్ టూరే మానుకున్నారు. ఇప్పుడా కేసును కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోరటు విచారణ జరిపింది. అసలు సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి జగన్ రెడ్డికి సంబంధం లేదని.. ఆ పత్రికతో జగన్ రెడ్డికి సంబంధం లేదని వాదించేశారు ఆయన లాయర్. అబ్బా.. చా ఇది నిజమా అని కోర్టు హాల్లో కూర్చున్న వారంతా మనసులో అనుకుని ఉంటారు. కానీ జగన్ రెడ్డి తత్వం అంతే. తాను పుట్టించిన పత్రికను కూడా తనది కాదని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య రాజకీయం చేస్తూంటారు.
ఇప్పటికే సాక్షి పేరుతో చేసిన ప్రజాధనం దోపిడీపై ఎక్కడ కేసులు పెడతారోనన్న భయంతో అసలు సాక్షికి.,.భారతికి సంబంధం లేదని ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డికీ సంబంధం లేదంటున్నారు. సజ్జల అయితే ఇంకా సేఫ్. ఆయన చేసిందంతా చేస్తారు కానీ.. నాకేం సంబంధం అన్నట్లుగా ఉంటారు. చివరికి సాక్షి పత్రిక ఎవరికీ సంబంధం లేని అనాథ. తప్పుడు ప్రచారాలు చేసి .. ఎవరికీ చెందకుండా పోతోంది.