జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా బెంగళూరుకు పయనమవుతున్నారు. ఉదయం వరకూ షెడ్యూల్ లో లేని బెంగళూరు పర్యటన ఉదయమే ఖరారు చేసుకున్నారు. ప్రత్యేక విమానం రెడీ చేసుకుని పదిన్నరకు బెంగళూరుకు బయలుదేరుతున్నారు. నిజానికి ఆయన షెడ్యూల్ లో అసెంబ్లీకి వెళ్లి ఓటు వేయాల్సిన అవసరం పడేలా ఉంటుందని అంచనాకు వచ్చారు. అందుకే ఆయన తాడేపల్లిలోనే ఉండాలనుకున్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికల్లో బలం లేకపోయినా పెద్దిరెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. ఆయనకు ఓటేయకుండా బెంగళూరు వెళ్లిపోవడానికి కారణం అదానీ వ్యవహారంలో వెలుగు చూసిన అవినీతి స్కామేనని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై తదుపరి కార్యాచరణ చర్చించడానికి ఆయనకు తాడేపల్లి కన్నా బెంగళూరు అయితేనే అనువుగా ఉంటుంది. ఇక్కడ అయితే ఎవరెవరు వచ్చారో తెలిసిపోతుంది. ఎక్కడయితే అంతా సీక్రెట్ గా జరిగిపోతుంది.
అమెరికా ఎఫ్బీఐ చాలా పకడ్బందీగా ఆధారాలు ఉంటేనే కేసులు పెడుతుంది. ఇప్పుడు కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే మరింత మైనస్ అవుతుంది. జగన్ రెడ్డి అత్యంత ఘోరంగా చేసిన అవినీతి వ్యవహారం బట్టబయలు అయిన తర్వాత కూడా సైలెంట్ గా ఉండదని.. ఏదో ఒకటి చేయాల్సిందేనని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.