అధికారంో వచ్చిన తర్వాత కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేయడం మోసం చేయడమేనని.. అధికారం చేపట్టగానే ఆ పని చేయడం సిన్సియారిటీ అని ప్రకటించారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని చెప్పారు. మూడేళ్లు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యాక్టరీని ప్రారంభించాల్సింది పోయి మరోసారి శంకుస్థాపన చేస్తున్నారు. బుధవారం ఆయన ఓ పార్టీ నేత కుమారుడి పెళ్లికోసం పులివెందుల వెళ్తున్నారు. పనిలో పనిగా సున్నపు రాళ్ల పల్లె వద్ద స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కూడా చేస్తున్నారు.
జేఎస్ డబ్ల్యూ సంస్థ సహకారంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెబుతున్నారు. గతంలో రెండు సంస్థల గురిచి ఇలాగే చెప్పారు. కానీ అడుగు ముందుగు పడలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నందున పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. అసలు గతంలో చేసిన శంకుస్థాపన ఏమైంది.. ఇప్పుడు మళ్లీ ఎందుకు చేస్తున్నారు.. అనే డౌట్ ప్రజలకు వస్తుందని కూడా పట్టించుకునే తీరిక లేదు. నిజానికి స్టీల్ ప్లాంట్ కు గత ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేశారు. భూములు కేటాయించారు. చైనా కంపెనీతో మాట్లాడారు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే అన్నీ మళ్లీ మొదటికి వచ్చాయి.
ఆ స్టీల్ ప్లాంట్ ప్రణాళికలు.. జరిగిన తతంగంఅంతా చెత్తబుట్టలో వేసి కొత్తగా ప్రారంభించారు. నాలుగేళ్లకు రెండో సారి శంకుస్థాపన జరగబోతోంది. ఇక పనులెప్పుడు జరుగుతాయో చె్పపడం కష్టం. వైఎస్ హయాంలో గాలి జనార్ధన్ రెడ్డికూడా అంతే. స్టీల్ ప్లాంట్ పెడతామని వేల ఎకరాలు తీసుకున్నారు ఎయిర్ పోర్టు కూడా వేల ఎకరాలు సొంతం చేసుకున్నారు. చివరికి ఏం జరిగిందో కళ్ల ముందే ఉంది. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ పరిస్థితి ఏమవుతుదో కానీ.. ఎన్నికలకు ముందు ప్రజల్ని మభ్య పెట్టాడనికి ఓ శంకుస్థాపన మాత్రం రెండో సారిచేస్తున్నారు.