ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రి అంటే దేశంలోనే నెంబర్ వన్ ఆస్పత్రి. అలాంటి ఆస్పత్రి మంగళగిరిలో పెట్టింది కేంద్రం. పేదలకు పది రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ?. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసింది. మంచి నీరు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత శుక్రవారం చంద్రబాబును కలిసిన ఎయిమ్స్ డైరక్టర్ తన గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ప్రాజెక్ట్ ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మంగళగిరిలో స్థలాన్ని కేటాయించారు. 2015లోనే శంకుస్థాపన చేయించారు. వేగంగా పూర్తి చేసేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు ఎయిమ్స్-మంగళగిరి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులతో కిటకిటలాడుతోంది. ఆసుపత్రి అందించే సేవలను విస్తరించడంతో ఇన్పేషెంట్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సర్జికల్ ఆంకాలజీతో సహా 10 రకాల సూపర్-స్పెషాలిటీ సేవలు మరియు 20 రకాల స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు.
గత ప్రభుత్వం ఎంత సాయం కావాలంటే అంత సాయం చేసి ఆస్పత్రిని పెట్టేలా చేస్తే.. వైసీపీ సర్కార్ మాత్రం..కనీసం నీళ్లు అందించడానికికూడా ఏర్పాట్లు చేయలేదు. సమీపంలోనే కృష్ణా ఉన్నా.. అవసరమైన నీటి కోసం .. చేయాల్సిన పనులు చేయడంలేదు. దీంతో ఎయిమ్స్ యాజమాన్యం.. ట్యాంకర్లపై ఆధారపడుతోంది.
అత్యంత తక్కువ ఖరక్చుతో వైద్య సేవలు అందుతాయి. ఈ ఆడ్మిషన్ చార్జీ కింద రూ.25 వసూలు చేస్తున్నారు. రోగి కోసం ఒక్కో పడకకు రోజుకు రూ.30 చార్జిగా నిర్ణయించారు. ఇవికాక, నర్సింగ్ చార్జీలు, ఇతర ఫీజులేమీ ఉండవు. వైద్య పరీక్షలు, మందులకు అతి తక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆస్పత్రికి ఎంత కావాలంటే సాయం చేయాల్సిన జగన్.. అది కేంద్రానిదని రాచి రంపాన పెట్టారు.