సీఎం జగన్ రెడ్డి పులివెందుల పర్యటన కోసం రెండు రోజులు వెళ్లారు. ఆయన ఉద్దేశంలో రెండు రోజులు అంటే.. ఈ రోజు సాయంత్రం వెళ్లి …రేపు ఉదయం తిరిగి వచ్చేసినా రెండు రోజులే. అలాంటి పర్యటనకు పులివెందుల వెళ్లారు. ఆయన చేసే శంకుస్థాపనలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎందుకంటే కట్టరని.. ఐదేళ్లుగా పులివెందులలో వర్షం పడితే కారే బస్టాండ్ తప్ప ఏమీ కట్టని వైనంతో స్పష్టమయింది. కానీ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వెంటపడటమే అక్కడ అసలు విషయం. పార్టీ నాయకులు దందాలకే పరిమితమైతే… ప్రజలు సమస్యల్లో ఉన్నారు. ఈ కారణంగా పరదాలు , బారికేడ్లు పెట్టుకుని పయనిచారు. ఎవర్నీ కలవనీయలేదు.
అదే సమయంలో పులివెందులో బీటెక్ రవి భారీ ఆఫీసు నిర్మించారు. ఇటీవలే థూమ్ థామ్ గా ప్రారంభించారు. ఆ ఆఫీసు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. అదే సేమయంలో గ్రామాల్లో టీడీపీలో చేరికలు పెరిగిపోయాయి. పులివెందులలో పర్యటించిన జగన్ రెడ్డికి ఏదో తేడాగా అనిపించింది. అందుకే.. తాను వెళ్లగానే ఏదో ఓ కేసు చూపించి బీటెక్ రవిని అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ రెడ్డి చేతిలో పోలీసులు ఉన్నారు కాబట్టి.. అరెస్టు చేయడం ఎంత సేపన్నట్లుగా…. ఇలాంటి వాటి కోసమే ఎప్పుడో నమోదు చేసిన కేసుల్ని బయటకు తీసి అరెస్టులు చూపించారు.
జగన్ రెడ్డి .. పులివెందులలో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారి.. ఇంత కాలం భయపెట్టి ఓట్లు పొందారేమో కానీ..ఇప్పుడు ఎవరూ భయపడటం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి అరెస్టుల వల్ల ఇంతకు మించి పీకేదేమీ ఉండదని టీడీపీ సానుభూతిపరులు కూడా ఓ అంచనాకు వస్తున్నారు. వివేకా హత్య తర్వాత వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి దారి తీస్తాయో కూడా పులివెందుల వైసీపీ వర్గాల్లో ఆందోళన ఉంది. ఈ క్రమంలో తప్పుడు అరెస్టులు అంటే…. పరిస్థితి మరింత దిగజార్చుకున్నట్లేనన్న వాదన కూడా వినిపిస్తోంది.