అంగన్వాడిలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో జారీ చేశారు సీఎం జగన్ రెడ్డి. ఎస్మా చట్టం పరిధిలోకి అత్యవసర సేవలు మాత్రమే వస్తాయి. అంగన్వాడిలు రారు. కానీ అంగన్వాడిల సేవలు కూడా అత్యవసర సేవల్లోకి చేర్చుతూ జీవో ఇచ్చి మరీ ఎస్మా ప్రయోగించారు జగన్ రెడ్డి., ఈ నిర్ణయం చూసి జగన్ రెడ్డి పూర్తిగా కంట్రోల్ తప్పిపోయారని.. అధికార మదంతో అధంపాతాళానికి దిగజారిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అంగన్వాడిలకు ఇచ్చేది అతి తక్కువ జీతం. ఎన్నికలకు ముందు వారికి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ చేయలేదు. పైగా.. ప్రభుత్వ పథకాలను కూడా నిలిపివేశారు. దాంతో వారు నాలుగున్నరేళ్ల పాటు వేచి చూసి ఇప్పుడు రోడ్డెక్కారు. అప్పటికీ వారిపై సానుభూతి లేకుండా.. బెదిరిపులకు దిగారు. కేసులు పెట్టారు. నిందించారు. అన్నీ చేసినా అంగన్వాడిలు తగ్గలేదు. హామీ ఇచ్చిన మేరకు జీతం పెంచుతామని కూడా చెప్పలేదు. ఎస్మా ప్రయోగించారు.
కానీ అంగన్వాడిలపై ఎస్మా ప్రయోగం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. వారేమీ అత్యవసర సేవల పరిధిలోకి రాదు.. జీవో తెచ్చినంత మాత్రాన అంగన్వాడి సేవలు అత్యవసర పరిధిలోకి రావు. న్యాయస్థానాలు వారి హక్కులను కాపాడతాయి. కానీ ఇక్కడ జగన్ రెడ్డి పూర్తి గా కంట్రోల్ తప్పి పోయి….చేస్తున్న పనులే ప్రజల్ని నివ్వెర పరుస్తున్నాయి. ఇతను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రినా లేకపోతే.. నియంతనా అన్న సందేహం ఎక్కువ మందికి వస్తోంది.