విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ సెక్రటేరియట్ ను అక్కడికి తీసుకుపోతున్నారు కానీ.. అక్కడ ఉన్న ఐటీ సంస్థలన్నింటినీ ముందుగానే వెళ్లగొడుతున్నారు. ఇందు కోసం.. ఐటీ సెజ్‌ను.. డీ నోటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐటీ సెజ్‌లో ఐటీ సంస్థలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలి. ఆ మేరకు సెజ్‌లో నోటిఫై చేశారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఐటీ సెజ్ ను… పరిపాలన సెజ్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది. డీనోటిఫై చేసి.. అక్కడ.. సెక్రటేరియట్..సీఎం ఆఫీస్ పెట్టాలనుకుంటోంది.
మధురవాడ ఐటి సెజ్ హిల్ నెంబర్-3, ఐటి పార్కు హిల్ నెంబరు-2, హిల్ నెంబరు-1 రుషికొండల్లో అనేక ఐటీ సంస్థలకు గత ప్రభుత్వం భూములు ఇచ్చింది. చాలా వరకూ పెట్టుబడుల దశల్లో ఉన్నాయి. వీటిల్లో అనేక ఒప్పందాలను కొత్త ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇందులో.. రూ. 70వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైన ఆదాని కూడా ఉంది. అక్కడే చంద్రబాబు.. ఏడాదిన్నరలో కట్టించిన.. మిలీనియం టవర్ పై ఇప్పుడు అధికార పార్టీ కన్ను పడింది. పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలను ఆహ్వానించడానికి దాన్ని నిర్మించారు చంద్రబాబు. కొన్ని కంపెనీలు.. ఒప్పందాలు చేసుకున్నాయి. కాండ్యూయెంట్ కంపెనీ పదిహేను వందల మంది ఉద్యోగులతో కార్యకాలాపాలు ప్రారంభించింది. ఇప్పుడీ కంపెనీని వెళ్లగొట్టేశారు.
చంద్రబాబు హయాంలో.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సహా..అనేక కంపెనీలు విశాఖకు రావడానికి చంద్రబాబు హయాంలో ఒప్పందాలు చేసుకున్నాయి. వాటికి సంబంధించిన కార్యాకలాపాలు సాగుతూండగానే… జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఐటీ ని పిటీగా మార్చేసింది. గత వారం తెలంగాణలోని వరంగల్ లో ప్రారంభమైన కొన్ని ఐటీ కంపెనీలు.. వాస్తవానికి విశాఖలో పెట్టాల్సి ఉంది. వాటికి సంబంధించి చంద్రబాబు ఎంఓయూలు కూడా చేసుకున్నారు. కానీ జగన్ సర్కార్ తీరుతో..ఎందుకొచ్చిన గొడవా అని వరంగల్ కు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఐటీని పూర్తిగా తరిమేసి…. రాజధానిగా అభివృద్ధి చేయాలని జగన్ తలపోస్తున్నారు.