చంద్రబాబు టూర్లో అల్లర్లు చేసింది వైసీపీ నేతలయితే కేసులు పెట్టింది టీడీపీ నేతలపై. కనీసం అరవై మంది కుప్పం టీడీపీ ముఖ్య నేతలపై బెయిల్‌కు వీల్లేని కేసులు పెట్టి ఇంకా జైల్లోనే ఉంచారు. వీరంతా జైల్లో ఉండగానే జగన్ కుప్పంలో పర్యటించి రావాలని డిసైడయ్యారు. జగన్ చేసిన రెండే రెండు నియోజకవర్గాల సమీక్షల్లో ఒకటి అయిన కుప్పం నుంచి వచ్చిన నేతలకు .. జగన్ కొన్ని హామీలిచ్చారు. ఆ ప్రకారం ఓ అరవై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తానన్నారు.
ఇప్పుడు ఆ పని మీద మరో వారం రోజుల్లో కుప్పంలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా టీడీపీ ముఖ్య నేతంలందర్నీ జైలు నుంచి బయటకు రాకుండా చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కుప్పంలో మంత్రి రామచంద్రారెడ్డి కసుసన్నల్లో వైసీపీ నడుస్తోంది. దాడులు చేయించినా.. దొంగ ఓట్లు వేయించినా ఆయన ప్లానేనని వైసీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. జగన్ పర్యటనలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి టీడీపీ నేతలను జైల్లో పెట్టారని అంటున్నారు.
అయితే జగన్ ఎక్కడకు వెళ్లినా …బారీకేడ్లు.. పరదాలు.. కామన్. చివరికి పులివెందులలోనూ తప్పడం లేదు. ఆయన పర్యటిస్తున్నారంటే టౌన్‌ను బంద్ చేయాల్సిందే. ఇక ముందస్తు అరెస్టుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. టీడీపీ నేతలను అరెస్ట్ చేయించి.. జైల్లో ఉంచి.. జగన్ కుప్పంలో పర్యటించాలనుకోవడాన్ని టీడీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు. ఇంత భయం పెట్టుకుని కుప్పంలో గెలుస్తారని ఎలా ఆశపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.