జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఓ రేంజ్ స్టేటస్మెయిన్ టెయిన్ చేశారు. ఎలా అంటే… ఆయన ఏదైనా అధికార పర్యటనకు వేరే జిల్లా వెళ్లాలనుకుంటే.. బెజవాడలో ఫ్లైట్ ఎక్కుతారు. భార్యను హైదరాబాద్ లో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి జిల్లా పర్యటనకు వెళ్తారు. వచ్చేటప్పుడు అదే రూట్లో పికప్ చేసుకుని వస్తారు. ఇక విదేశీ పర్యటనకు వెళ్లాలంటే.. అత్యంత లగ్జరీయస్ స్పెషల్ ఫ్లైట్ ను బుక్ చేసుకుంటారు. స్విట్జర్లాండ్ వెళ్లినా..లండన్ వెళ్లినా ఆ వైభవం గురించి చెప్పాల్సిన పని లేదు. మరి అధికారం పోయిన తర్వాత?
ఇప్పటికే ప్రతి వారం బెంగళూరు టు తాడేపల్లి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఆయన సాధారణ ఫ్లైట్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు లండన్ పోవడానికి కూడా అలాంటి ప్లైటే బుక్ చేసుకుని బయలుదేరిపోయారు. ఎప్పుడు వెళ్లారో ఎవరికీ తెలియదు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచే వెళ్లిపోయారు. లండన్ చేరుకున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. గతంలో అయితే.. ఆయన కోసం ముందుగానే వెళ్లి మోకాళ్ల దండల స్వాగతాలు చెప్పడానికి ఓ టీంను రెడీ చేసుకునేవారు. వారు జగన్ కారులో వస్తూంటే.. మోకాళ్ల మీద నించుని స్వాగతాలు చెప్పేవారు. ఇదేం బానిసత్వమో అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ స్వాగతాలు ఉంటాయి. ఇప్పుడు అవీ లేవు.
సీఎంగా ఉన్నప్పుడు ప్రజాధనంతో ఇవేం జల్సాలండి.. వ్యక్తిగత పర్యటనలకూ జనం సొమ్ము వాడతారా అని వచ్చే విమర్శలకు.. వైసీపీ సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడేది. ఆయన వ్యక్తిగత పర్యటనకు సొంత డబ్బు పెట్టుకుంటున్నారని చెప్పేవారు. అదే నిజమైతే ఇప్పుడుకూడా సొంత డబ్బుతో అలాంటి ఫ్లైట్లు, ఏర్పాట్లు, స్వాగతాలు ఎందుకు చేసుకోవడం లేదు ?. అప్పుడు ప్రజాధనం కాబట్టి అప్పనంగా వాడేశారు.. ఇప్పుడు సొంత డబ్బు కాబట్టి.. చేతులు రావు.