ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారవర్గాల్లో ఇప్పుడో డెవలప్మెంట్ చర్చోపచర్చలకు కారణం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొంది.. అన్న.. అన్న అంటూ ఆదరణ పొందిన ఓ అధికారి ఇప్పుడు…జగన్ విశ్వాసాన్ని కోల్పోయారు. ఎంతగా అంటే.. ఇప్పుడు ఆయనతో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదట. సమీక్షల్లో వచ్చి పక్కనే కూర్చున్నా.. ఆయన వైపు చూడటం లేదని చెబుతున్నారు. ఆ శాఖకు సంబంధించి ఏమైనా తెలుసుకోవాలన్నా.. సలహాదారులో లేక ఇతరులోనో అడుగుతున్నారు. దీంతో ఆ ఉన్నతాధికారి బాగా ఫీలైపోయి.. తన సేవలు అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి.. సేలవులో వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికీ… తన అసంతృప్తి గురించి తెలిసి.. పిలిచి… ” అదేం లేదులే ఉండు…” అని ఓ మాట చెబితే.. ఉండిపోవడానికి ఆయన రెడీగా ఉన్నారని.. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం.. ఆయన ఉన్నా . లేకపోయినా పెద్ద తేడా లేదు కాబట్టి.. సెలవుపై వెళ్లినా పోయేదేమీ లేదని పరోక్ష సందేశం పంపుతున్నారు. దీంతో ఆ ఉన్నతాధికారికి ఎటూ పాలు పోవడం లేదు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వతా సీఎస్‌గా ఎల్.వి.సుబ్రహ్మణ్యంతో పాటు ఆయనకు కూడా అందలం దక్కింది. అత్యంత కీలకమైన వ్యవస్థకు అధిపతి కావడంతో ఆయన కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా చేసుకుపోయారు. ఆయనకు ఆ కష్టం కూడా ఎందుకనుకున్నారో కానీ ప్రభుత్వ పెద్దలు ఆయనకు చెప్పకుండానే పనులు చేయడం ప్రారంభించారు.
అయితే ఆయనకన్నా ఎక్కువ విశ్వసనీయత ప్రభుత్వ పెద్దలపై చూపుతూ మరికొంత మంది అధికారులు.. ఆయన శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేశారు. చివరికి తాను డమ్మీ అయ్యానని అర్థం చేసుకున్నా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందంటున్నారు. గతంలో సిన్సియర్.. పవర్ ఫుల్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన సర్వీసు ఉన్నప్పటికీ.. ఏంచేయాలోతెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. సీఎం జగన్ దగ్గర కోల్పోయిన విశ్వసనీయతను మళ్లీ తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. అయితే అది సాధ్యంకాదని.. ఆయనకు గట్టి సంకేతాలే అందుతున్నాయని సివిల్ సర్వీస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.