తాడేపల్లిలోని ప్యాలెస్ వద్ద జగన్ రెడ్డి దాదాపు వేయి మందిని సెక్యూరిటీగా నియమించుకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది. ఎందుకు జగన్ ఇంతపెద్దమొత్తంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు..? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ప్రధాని, రాష్ట్రపతి సహా గత ముఖ్యమంత్రులు కూడా నివాసాల వద్ద ఇంత పెద్ద మొత్తంలో భద్రత వలయాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కానీ , జగన్ రెడ్డి మాత్రం ఏకంగా వేయి మంది సెక్యూరిటీని నియమించుకోవడం గమనార్హం. 2019లో జగన్ కు దక్కిన ఏకపక్ష విజయం చూస్తే ఆయనకు ప్రజల నుంచి ఎలాంటి ముప్పు లేదనేది సుస్పష్టం. అయినా మరెవరి నుంచి ముప్పు ఉంటుందని సెక్యూరిటీని పెంచేసుకున్నారు అన్నది పెద్ద ప్రశ్న.
అయితే, ఈ స్థాయి సెక్యూరిటీని జగన్ నియమించుకోవడానికి నియంతలనే ఆదర్శంగా తీసుకున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఫామ్ హౌజ్ లో ఉన్నప్పుడు దాదాపు 200 -300 మంది భద్రతా సిబ్బంది ఉండేవారని అంటున్నారు.
పలు విషయాల్లో కేసీఆర్ ను ఫాలో అయ్యే జగన్, ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ వద్ద 200, 300 మంది సిబ్బంది ఉంటే తనకు అంతకు మూడింతలు ఉండాలని అనుకున్నారేమో… జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలోని ప్యాలెస్ వద్ద ఏకంగా వేయి మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.