జగన్మోహన్ రెడ్డి తనకు మనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెబుతారు. 99.8 శాతం అమలు చేశానని విచిత్రమన లెక్కలు ప్రకటిస్తూంటారు. కానీ మేనిఫెస్టోను చూస్తే అందులో ఒక్కటంటే ఒక్కటీ అమలు చేసినట్లుగా ఉండదు. అన్నీ మాయ లెక్కలు..తప్పుడు కబుర్లతో ఎదురుదాడి చేస్తూ అమలు చేశామని నమ్మించేందుకు ప్రయత్నిస్తూంటారు. నమ్మకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అనే హెచ్చరికలు సహజంగానే వస్తాయి.
మద్య నిషేధంపై మేనిఫెస్టోలో ఉంది ఇదీ !
“ కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమై పోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుదశల్లో మద్యాన్ని నిఫేధిస్తాం. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం,” అని మేనిఫెస్టోలో ఉంది. అంతకు ముందు జగన్ రెడ్డి మద్య నిషేధంపై చేసిన ప్రసంగాలు చూసిన ఎరికైనా.. చేసేస్తాడని అనుకునేవారు. అంతగా నటన రక్తి కట్టించేవారు.
అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతామన్నారు..!
ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక మద్య పాన నిషేధం అంచెలంచెలగా అంటూ ఏవో జీవో లు జారీ చేశారు. కానీ పాలసీ మార్చి.. దుకాణాలన్నీ చేతుల్లోకి తీసుకున్నారు. ఏటా ఇరవై శాతం దుకాణాలు తగ్గిస్తామన్నారు. ఒక్క ఏడాది తగ్గించారు. అమ్మే సమయాలు తగ్గించారు. ఆ హడావుడిలో మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని సవాల్ చేశారు. సీఎం జగన్ అదే మాట అన్నారు. మహిళా నేతలతోనూ చెప్పించారు. విడదల రజనీ కూడా సవాల్ చేశారు. ఇప్పుడు ఎవరూ ఒక్క మాట మాట్లాడటం లేదు.
పేదల్నీ పీల్చి పిప్పి చేసిన మద్యం పాలసీ
పేదలకు షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచుతామని చెప్పి… అలాగే చేశారు. మరి మద్యానికి అలవాటు పడిన వాళ్లు షాక్ కొట్టిందని తాగకుండా ఉంటారా… ఇంట్లో వస్తువులు కూడా తాకట్టు పెట్టి తాగారు. ఇలా ఎంతో ప్రభుత్వంపై తిట్లందుకుంటే.. వారు అనుమానాస్పదంగా చనిపోయారు. చీప్ లిక్కర్ బ్రాండ్లను పెద్ద మొత్తానికి అమ్మడంతో.. ఎంత మంది ఆరోగ్యాలు పోయాయో.. ఎంత మంది ప్రాణాలు పోయాయో చెప్పడం కష్టం. మద్యం అలవాటు ఉన్న కుటుంబాలు చితికిపోయాయి.
ప్రభుత్వ నకిలీ మద్యానికి తోటు నాటు సారా, దొంగ మద్యం
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ నేతలకు అత్యధిక ఆదాయం సంపాదించి పెట్టిన అంశం మద్యం పాలసీ. అసలు పాలసీ ద్వారా ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు వెనకేసుకుంటే.. నాటు సారా, దొంగ మద్యం ద్వారా ద్వితీయ శ్రేణి నేతలు సంపాదించుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో ఈ వ్యాపారం చాలా ఎక్కువగా సాగింది. ఎలా చూసినా ప్రజల్ని మాత్రం పీడించుకుతిన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరోసారి ఓట్లు అడగడగానికి వస్తున్నారు. మద్యనిషేధం గురించి ఆయన సభల్లో ఒక్క మాట మాట్లాడటం లేదు. గతంలో తాను చేసిన ప్రకటనల గురించి మాట్లాడటం లేదు. ప్రజలకు పది రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారన్న ఓ గుడ్డి నమ్మకంతో ఆయన విచ్చలవిడిగా రాజకీయం చేస్తున్నారు.