ప్రభుత్వ స్కూళ్ల రాత మారుస్తామని వేల కోట్లు ఖర్చు పెట్టారు. అవన్నీ ఏమయ్యాయి…? రంగుల్లో కలిసిపోయాయి. కానీ విద్యార్థులు మాత్రం ఆ స్కూళ్లలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. డబ్బులు ఖర్చు పెట్టుకుని అయినా ప్రైవేటు స్కూళ్లలో చేరిపోతామని రెడీ అయిపోతున్నారు. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య ఆరు లక్షలు తగ్గిపోయింది. ఇంత దారుణమైన పతనం గతంలో ఎప్పుడూ లేదు.
జగన్ రెడ్డి పేద ప్రజల విద్యను పణంగా పెట్టి రాజకీయం చేశారు. మొదట తెలుగుమీడియం ఎత్తేశారు. నిజానికి తెలుగు మీడియం ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ మీడియం ను కూడా అందుబాటులోకి తెస్తే సరిపోయేది. ఎవరికి ఆసక్తి ఉంటే అందులో చదువుకునేవాళ్లు. ఏదైనా నిర్ణయం ఓ పద్దతిగా అమలు చేసుకుంటూ రావాలి. ఒక్కసారే ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో నష్టం. ఇప్పుడు ఆరేడు తరగతులవరకూ తెలుగు మీడియంలో చదువుకున్న వారు భవిష్యత్ ను కోల్పోయే పరిస్థితి వచ్చింది.
పోనీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడైనా కొత్తగా టీచర్లను రిక్రూట్ చేసుకోవాలి. కానీ నాలుగేళ్ల నుంచి ఒక్క టీచర్ నియామకాన్ని చేపట్టలేదు. స్కూళ్లను విరివిగా మూసేసి.. టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. ఏ ఒక్క పాఠశాలలోనూ పూర్తి స్థాయి సబ్జెక్ట్ టీచర్లు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ.. జగన్ రెడ్డి మాత్రం… టోఫుల్, ఐలెట్స్ చెప్పిస్తానని ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. పనికి రాని బైజూస్ కంటెంట్ కు వందల కోట్లు చెల్లిస్తూ ఉంటారు.
పిల్లల విద్యలోనూ కమిషన్లు వెదుక్కోవటంతో.. ఆ కమిషన్లు వచ్చాయేమో కానీ… పిల్లల విద్య మాత్రం నాశమైపోయింది. భావితరం పేదల జీతితాలను జగన్ రెడ్డి… మరింత దుర్భరంగా చేశాడు. పేదలకు చుదవుల్ని మద్యలోనే ఆపేయడం .. ద్వారా వారిని పేదరికంలోనే మగ్గేలా చేయడంలో తన ప్లాన్ ను విజయవంతంగా అమలు చేసుకున్నారు.